మళ్ళీ బంగారం ధరలకు రెక్కలు.. వాళ్ళ ఆశలపై నీళ్ళు.. లేటెస్ట్ ధరలిలా!
ఇటీవల బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టడంతో, మరింత బంగారం వెండి ధరలు తగ్గుతాయని ఆశపడిన సామాన్య మధ్య తరగతి ప్రజల ఆశల పైన మళ్లీ నీళ్లు చల్లినట్టు బంగారం ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు తగ్గుతాయని ఆశపడిన వారికి శ్రావణమాసంలో జెట్ స్పీడ్ తో బంగారం ధరలు దూసుకుపోతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది.
మళ్ళీ షాకిస్తున్న బంగారం ధరలు.. ఢిల్లీలో ధరలిలా
ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించేందుకు సిద్ధమవడం, ఆర్థిక మాంద్యంపైన భయాలు, వడ్డీరేట్ల కోత నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారానికి భారీగా డిమాండ్ పెరిగిందని దీంతో మళ్ళీ బంగారం ధరలు వైఫైకి వెళ్లే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా బంగారం ధరల విషయానికి వస్తే నేడు దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 24క్యారెట్ల బంగారానికి 72,920రూపాయలుగా కొనసాగుతుండగా, 22క్యారెట్ల 10గ్రాముల బంగారం 66,850గా ఉంది.

ముంబై, హైదరాబాద్ లో బంగారం ధరలిలా
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66, 770 రూపాయలు కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,770 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 72,770 కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,770 రూపాయలుగా ఉంది.
విజయవాడ, బెంగళూరులో బంగారం ధరలిలా
విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,770 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 72,770 రూపాయలు. బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 72, 770 కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,770 గా విక్రమ్ అవుతుంది.
చెన్నై లో బంగారం ధరలు
ఇక దేశంలోనే బంగారం ధరలలో ఎక్కువ రేట్లు ఉండే తమిళనాడు రాష్ట్రంలో కూడా నేడు బంగారం ధర ఇలా ఉంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి 72,770 రూపాయలు కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 66,700గా విక్రయం అవుతుంది.
బంగారం బాటలోనే వెండి కూడా
వారాంతంలో బంగారం ధర 24 క్యారెట్ల బంగారానికి 10 గ్రాములకు 1140 రూపాయలు పెరగగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఒక వెయ్యి 50 రూపాయలు పెరిగి మళ్లీ సామాన్య మధ్యతరగతి ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఇదిలా ఉంటే కిలో వెండి ధర నేడు 2000 రూపాయలు పెరిగి 90 వేల మార్కును దాటింది. హైదరాబాద్ మార్కెట్లో కూడా తులం వెండి ధర 910 రూపాయలు వద్ద కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications