ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వాహనమిత్ర పథకంపై కీలక అప్డేట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల సంక్షేమం కోసం అన్నివైపుల నుంచి కృషి చేస్తోంది. ఎన్నికలకు ముందు మాట ఇచ్చినట్టుగా సూపర్ సిక్స్ పథకాల హామీని నెరవేరుస్తుంది. ఏపీలో ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏపీ వాహన మిత్ర పథకాన్ని అందించి 15వేల రూపాయలు సహాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించి ఆటోవాలాలకు, క్యాబ్ డ్రైవర్లకు శుభవార్త చెప్పింది.

ఈ పని చేస్తే ఏపీ వాహనమిత్ర ద్వారా ఆర్ధిక లబ్ది
ఏపీ వాహన మిత్ర పథకం ద్వారా గతంలో లబ్ధి పొందిన లబ్ధిదారులకు కొత్త దరఖాస్తులు అవసరం లేకుండా ఈ కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేయడం ద్వారా ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. దీనికోసం గతంలో లబ్ధి పొందిన వాహనదారులు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కేవైసీ వెరిఫికేషన్ పూర్తి చేస్తే 15వేల రూపాయల ఆర్థిక సహాయం అక్టోబర్ 1న నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ అవుతుంది.

Good news 15 thousand rupees in their account verification begins for ap vahana mitra scheme

Take a Poll

వాహనాల మరమ్మత్తులకు వాహన మిత్ర పథకం
ఈ వాహన మిత్ర పథకం ద్వారా ప్రభుత్వం ఆటోలు, టాక్సీలు నడుపుతూ జీవనం సాగిస్తున్న వారి మరమ్మత్తు ఖర్చులు, రోడ్డు ఫీజులు, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఫీజులు, వాహన బీమా తదితర ఖర్చుల నిమిత్తం అందిస్తోంది. ఈ పథకం ఆటోలు, టాక్సీలు నడిపే వారి జీవన ఉపాధికి మరికొంత ఆర్థిక భరోసాను అందిస్తోంది. దీనికి సంబంధించి లబ్ధిదారుల జాబితా ఇప్పటికే GSWS యాప్ లో అందుబాటులో ఉంది.

లబ్దిదారులే అవసరం లేదు.. కుటుంబ సభ్యులైనా చెయ్యొచ్చు
ఈ పథకాన్ని పొందాలనుకునే లబ్ధిదారులు సచివాలయ సిబ్బందిని సంప్రదించి ఓటిపి ద్వారా, బయోమెట్రిక్ ద్వారా లేదా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ కేవైసీ పూర్తి చేయడానికి ఆధార్ కార్డు, వాహనం ఆర్ సి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీ, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్ వంటి పత్రాలను తీసుకువెళ్లాలి. లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే లబ్ధిదారుల కుటుంబ సభ్యులైనా ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు.

ఈకేవైసీలో ఇబ్బందులు వస్తే ఇలా చెయ్యాలి
ఇక ఈ కేవైసీ ని పూర్తి చేయడంలో ఏవైనా ఇబ్బందులు వస్తే లాగౌట్ చేసి మళ్లీ లాగిన్ చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. ఓటిపి రావడంలో ఇబ్బందులు ఏమైనా ఎదురైతే మీ ఆధార్ కు మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఏవైనా పేర్లలో తేడాలు ఉంటే వాటిని సరిచేసి అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలి.

స్టేటస్ మీరే చెక్ చేసుకోవచ్చు
ఇక ఈ పథకానికి సంబంధించి ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత స్టేటస్ ను చెక్ చేసుకోవడానికి గ్రామ లేదా వార్డు సచివాలయం GSWS యాప్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ పథకం డ్రైవర్లకు సులభంగా సహాయం అందించడానికి రూపొందించబడిన పథకం. గతంలో లబ్ధి పొందిన వారు ప్రస్తుతం ఎటువంటి అప్లికేషన్ లేకుండా కేవలం ఈ కేవైసీ తో ఈ పథకాన్ని అందుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+