సినిమా ప్రియులకు శుభవార్త.. రేపు 99రూపాయలకే సినిమా టికెట్లు.. త్వరపడండి!!
జాతీయ సినిమా దినోత్సవాన్ని ( National cinema day) పురస్కరించుకొని సినిమా ప్రియులకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) బంపర్ ఆఫర్ ప్రకటంచింది. ఈనెల 13న జాతీయ సినిమా దినోత్సవం ను పురస్కరించుకొని భారతదేశం అంతటా 99 రూపాయల కన్నా తక్కువకే సినమా చూసే అవకాశం కల్పించింది.
అన్ని వయసుల ప్రేక్షకులకు ఒక రోజు సినిమా ఆనందాన్ని తీసుకువచ్చే క్రమంలో మల్టిఫ్లెక్స్ అసోసియేషన్ ఈ ఆఫర్ ను ప్రకటించింది. గత ఏడాది జాతీయ సినిమా దినోత్సవం రోజున అత్యధికంగా ఒకేరోజు 6.5 మిలియన్ల వీక్షకులతో రికార్డు నెలకొల్పగా ఈ ఏడాది ఆరికార్డును అధిగమించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ఏడాది 4000కు పైగా స్క్రీన్లు ఈ వేడుకను జరుపుకోనున్నాయి.

PVR INOX, CINEPOLIS, MIRAJ, CITYPRIDE, ASIAN, MUKTA A2, MOVIE TIME, WAVE, M2K, DELITE వంటి ప్రఖ్యాత సినిమాలతోపాటు అనేక ఇతర సంస్థలు ఈ సేల్‌లో పాల్గొంటూ 99 రూపాయల కన్నా తక్కువ ధరకే టిక్కెట్లు అందించనున్నాయి. ఈ సంవత్సరం విడుదలైన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడంతో సినీ ప్రేక్షకులందరికి ధన్యవాదాలు తెలుపుతూ, కొత్తవారిని ఆహ్వానిస్తూ మల్టిఫ్లెక్స్ అసోసియేషన్ బహిరంగ లేఖ విడుదల చేసింది.
జాతీయ సినిమా దినోత్సవ సందర్భంగా అతి తక్కువ ధరలకే సినిమా టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. సినిమా ప్రియులు మల్టీప్లెక్స్ సంబంధిత వెబ్సైట్లలో నేరుగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇక టికెట్ల ధరల గురించి, వారు అందిస్తున్న ఆఫర్లు గురించి మరిన్ని వివరాలు సంబంధిత సినిమా థియేటర్లలోనూ, వారి వెబ్సైట్లోనూ, మరియు వారి సోషల్ మీడియా ఛానల్ ద్వారా వెల్లడి చేయబడ్డాయి.
టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు బుక్ మై షో, పేటీఎం ల ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. మీరు తక్కువ ధరలకే థియేటర్ లో సినిమా దినోత్సవం రోజు సినిమా చూడాలనుకుంటే సంబంధిత సినిమాలను సెలెక్ట్ చేసుకుని ఫ్రైడే అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆపై సినిమా టికెట్ల ధరలు చెల్లించి బుక్ చేసుకోవాలి .మల్టీప్లెక్స్ ల ద్వారా పన్నులు మరియు చార్జీల ప్రకారం వివిధ ధియేటర్లలో ధరలలో వ్యత్యాసం ఉండవచ్చు.












Click it and Unblock the Notifications