ఏపీలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు శుభవార్త.. భారీగా బోనస్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త చెప్పింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, అధికారులకు వారి ఒక నెల గ్రాస్ శాలరీని బోనస్ గా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.

ఎన్నికల డ్యూటీ చేసిన వారికి ఒక నెల గ్రాస్ శాలరీ బోనస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన ఉద్యోగులు, ఎన్నికల అధికారులకు ఒక నెల గ్రాస్ శాలరీని వేతనంగా చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో ఎన్నికలు విధులు నిర్వర్తించిన వారికి వేతనంగా ఒక నెల గ్రాస్ శాలరీ కి సమానమైన డబ్బులు చెల్లించాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Good news for the employees who performed ap general election duties one month gross salary bonus

రాత్రనకా, పగలనకా ఎన్నికల విధులు నిర్వర్తించిన అధికారులు, సిబ్బంది
దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వర్తించిన ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహణకు తీవ్రంగా కష్టపడ్డారు. రాత్రనకా పగలనకా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా తమకు కేటాయించిన విధులను సక్సెస్ ఫుల్ గా నిర్వహించారు.

ఉద్యోగులు చేసిన సేవలకు ప్రతిఫలం
ఈ క్రమంలోనే ఎన్నికల విధులలో వారు చేసిన సేవలను గుర్తించిన ఎన్నికల సంఘం వారికి ఒక నెల జీతాన్ని అదనంగా ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చింది. అంతేకాదు మే 14వ తేదీన ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి ప్రత్యేక క్యాజువల్ లీవ్ (ఆన్ డ్యూటీ) కూడా ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం ఒక నెల జీతం బోనస్ గా ఇస్తూ ఉండడంతో ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులలో హర్షం వ్యక్తమౌతుంది.

ఎవరికి ఎంత చెల్లించాలో నిర్ణయించనున్న సిఈఓ
ఇదిలా ఉంటే ఎన్నికల విధులు నిర్వర్తించిన వారికి చేసే వేతనాల చెల్లింపులు క్యాడర్ ను బట్టి ఏపీ ఎన్నికల అధికారి నిర్ణయిస్తారు. ఎన్నికల విధులు నిర్వహించిన డీఈవోలు, ఆర్వోలు, ఏఆర్వో, ఎన్నికల సిబ్బందికి ఒక నెల గ్రాస్ శాలరీకి తక్కువ కాకుండా.. అందుకు సమానంగా చెల్లిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+