Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పర్యాటకులకు తీపికబురు.. అరకు ఉత్సవ్ కు రెడీ అవ్వండి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు అందాలు చూడాలనుకునే పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. చలికాలంలో అరకులోయ అందాలను చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం అరకులోయలో చలి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరం జనవరి 3, 4 తేదీలలో అరకులోయలో చలి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.

అరకు ఉత్సవ్ .. ప్రత్యేక ఆకర్షణలు
అరకులోయ ఏర్పాట్లపైన అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష నిర్వహించి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాలలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, అరకు గిరిజనుల సాంప్రదాయ నృత్యాలు, అనేక స్టాల్ ల ప్రారంభోత్సవం, ఫ్లవర్ షో, లేజర్ షో, సైక్లింగ్, గిరిజన సాంప్రదాయ ప్రదర్శనలు, పెయింటింగ్ పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా చూడాలన్నారు.

Good news for tourists Get ready for the Araku Utsav

Take a Poll

రెండు రోజుల పాటు చలి ఉత్సవ్
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి గిరిజన కళాకారులను రప్పించి అక్కడ చలి ఉత్సవంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఇందుకోసం అప్పగించిన పనులను ప్రతి ఒక్కరూ సక్రమంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు విశేషమైన ప్రచారాన్ని కల్పించాలని కూడా, పబ్లిసిటీకి సంబంధించి టీజర్లు, వాల్ పోస్టర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఐటీడీఏ ల నుండి స్టాల్స్ ఏర్పాటు
అరకు చలి ఉత్సవ్ లో భాగంగా మొదటి రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు నిర్వహిస్తారు. రెండవ రోజు జనవరి 4న సైక్లింగ్ పోటీలు, లేజర్ షో, ఫ్లవర్ షో వంటివి నిర్వహిస్తారు. గిరిజన సాంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనలు ఈ ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఏ ల నుండి స్టాల్స్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు.

అరకు ఉత్సవ్ లో సందర్శకుల కోసం ఫుడ్ స్టాల్స్
సందర్శకుల కోసం ఫుడ్ స్టాల్స్, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా చూడాలన్నారు. ఈ చలి ఉత్సవాలను ప్రతి శీతాకాలంలో జనవరి మాసంలో నిర్వహిస్తారు. అరకు ఉత్సవ్ పేరుతో నిర్వహించే ఉత్సవం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. దీనికోసం ప్రతి సంవత్సరం ప్రభుత్వం నిధులను విడుదల చేసి అరకుకు పర్యాటకులను వచ్చేలా చేస్తుంది. ఈ చలికాలం అంతా అరకుకు వచ్చే పర్యాటకులు అరకు అందాలను చూసి మైమరచిపోతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+