అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాస్తు ప్రకారం రాజధాని: అద్భుత అమరావతి నగరి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి బృహత్ ప్రణాళికను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ బృందం సోమవారం నాడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఇచ్చింది. ఈ సందర్భంగా ఇరువురు కలిసి రాజధాని మాస్టర్ ప్లాన్ పైన సంయుక్త ప్రకటన చేశారు.

రాజధాని మాస్టర్ పాలన్ పైన ఆనం కళాకేంద్రంలో సెమినార్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు.

ఏపీ ప్రజల రాజధాని అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ నిర్మించే రాజధాని కేంద్ర ప్రాంతం (సీడ్‌ క్యాపిటల్) అభివృద్ధికి సింగపూర్‌ ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సోమవారం రాజమండ్రిలో ప్రభుత్వానికి అందించింది. 2050 నాటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రజా రాజధానికి రూపకల్పన చేసింది.

 అమరావతి

అమరావతి

కేంద్ర ప్రాంతాన్ని స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మార్గదర్శ ప్రణాళికను ఇచ్చింది. రాజధాని నగరంలో జీవన విధానం, ప్రజా రవాణా సౌకర్యాలు, పచ్చదనం, పరిశుభ్రత, కాలుష్య రహిత పరిశ్రమల కలబోతతో రాజధాని కేంద్ర ప్రాంతం రానుంది.

అమరావతి

అమరావతి

ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ చారిత్రక, వారసత్వ సంపదను కాపాడుతూ ప్రపంచ స్థాయి ప్రమాణాలు ఉండేలా ప్రణాళిక రూపొందింది. అమరావతి రాజధాని నగరంలో కృష్ణా నదిని ఆనుకుని తాళ్లాయపాలెం - లింగాయపాలెంల మధ్య 16.9 చదరపు కిలోమీటర్ల పరిధిలో కేంద్ర ప్రాంతం రానుంది.

అమరావతి

అమరావతి

ఇందులో వాటర్‌ ఫ్రంట్‌ పేరుతో కృష్ణా నది పాయలకు ఆనుకుని కొంతభాగం తాళ్లాయపాలెంకి సమీపంలోని లంకలోనూ ఉంటుంది. రాజధాని కేంద్ర ప్రాంతాన్ని మూడు లక్షల మంది నివాసముండేలా రూపొందించింది. దీనిని వివిధ రూపాల్లో అభివృద్ధి చేయనుంది.

అమరావతి

అమరావతి

ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఉండే ప్రాంతం, డౌన్‌టౌన్‌, అమరావతి గేట్‌వే, వాటర్‌ఫ్రంట్‌ పేరుతో ఇవి ఉండనున్నాయి. రాజధాని కేంద్ర ప్రాంతానికి 4 అభివృద్ధి కేంద్రాలుకేంద్ర ప్రాంతం అభివృద్ధి కోసం నాలుగు దిక్కుల్లో నాలుగు ప్రధాన కేంద్రాలు ఉంటాయి. అమరావతి ముఖద్వారం, అమరావతి వాణిజ్య ప్రాంతం, అమరావతి ప్రభుత్వ కార్యాలయాలు, అమరావతి నదీముఖం. ఒక్కో కేంద్రం రాజధాని అభివృద్ధిలో కీలకపాత్ర పోషించనుంది.

 అమరావతి

అమరావతి

తాళ్లాయిపాలెం నూతన రాజధాని అమరావతి ముఖద్వారంగా మారనుంది. అమరావతి రాజధాని కేంద్ర ప్రాంతానికి చేరుకునే ముఖద్వారం ఇక్కడే ఉంటుంది. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి అరగంటలో చేరుకునేందుకు ప్రధాన వారధిగా మారనుంది.

అమరావతి

అమరావతి

కృష్ణానది మీద అద్భుతమైన శైలిలో నిర్మించే వంతెన ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ముఖద్వార మార్గంలో సిటీ గ్యాలరీ, చిత్తడినేల ఉద్యానవనం, సాంస్కృతిక కేంద్రం, అమరావతి ప్లాజా, విశ్వవిద్యాలయం ఉంటుంది.

అమరావతి

అమరావతి

అమరావతి వాణిజ్య కేంద్రం... ఐటీ ఆధారిత అభివృద్ధి కేంద్రమిది. ఉద్దండ్రాయునిపాలెం గ్రామ పరిధిలో వాణిజ్య కేంద్రం వస్తుంది. ప్రజారవాణా అధికంగా వినియోగించుకుంటూ ఏడు రవాణా ఆధారిత అభివృద్ధి కేంద్రాల ప్రాజెక్టులు వస్తాయి. ఐటీ, ఇతర వాణిజ్య కేంద్రాలకు నిలయంగా ఉంటుంది. నగరంలో ఎత్త్తెన ఆకాశ హార్మ్యాలు ఇక్కడే రానున్నాయి. ఇక్కడ నివాస, వాణిజ్య కేంద్రాలు ఒకేచోట ఉండేలా సమీకృత అభివృద్ధి ఉంటుంది. ప్రజలు ఎక్కువగా ప్రజా రవాణా వినియోగించుకునేలా అభివృద్ధి జరుగుతుంది.

అమరావతి

అమరావతి


లింగాయపాలెం గ్రామానికి ఆనుకుని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వస్తుంది. రాష్ట్రపతి భవన్‌ మాదిరి నిర్మాణంలోనే సచివాలయం, శాసనసభ, మంత్రుల కార్యాలయాలు ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్సు తొలి భవనాన్ని హైకోర్టుకు కేటాయించింది. ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల పరిధిలోని ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థలు, మరోవైపు నగర గ్యాలరీ ఉంటుంది.

 అమరావతి

అమరావతి

అమరావతి వాణిజ్య కేంద్రం, ప్రభుత్వ కోర్‌ మధ్యలో బొటానికల్‌ గార్డెన్‌, ప్రాంతీయ ఆసుపత్రులకు ప్రణాళిక రూపొందించింది. నగరంలో నీటి కాలువల వెంట పార్కులు వస్తాయి. కృష్ణా నదికి ఆనుకుని వస్తోన్న రాజధానికి నదీతీరం ఓ ఆకర్షణగా మారనుంది. నదీతీరాన్ని అందంగా తీర్చిదిద్దుతూ ప్రజలకు ఆహ్లాదంగా ఉంటుంది. మొత్తం రాజధాని నగరంలో దాదాపు 30 కి.మీ దూరంపాటు నదీతీరాన్ని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది.

 అమరావతి

అమరావతి

రాజధాని కేంద్ర ప్రాంతం పరిధిలో నదీతీరానికి ఆనుకుని అమరావతి ప్లాజా, కన్వెన్షన్‌ కేంద్రం, క్రీడా సౌకర్యాలు, సాంస్కృతిక కేంద్రం వస్తాయి. నదీ తీరంలోని ఈ వినోద కేంద్రాలు రాజధాని ప్రజలకు ఆహ్లాదాన్ని ఇవ్వనున్నాయి. సీఆర్‌డీఏ పరిధిలో ఏడు ప్రాంతీయ కేంద్రాలు, ఏడు అభివృద్ధి కారిడార్‌లు ఉన్నాయి.

అమరావతి

అమరావతి

ఒక్కో ప్రాంతం ఒక్కో రంగానికి హబ్‌గా తయారు కానుంది. రాజధాని నగరం మెగా సిటీగా వ్యాపార, వాణిజ్య హబ్‌గా రూపొందనుంది.రాజధాని నగరంలో తొలి పదేళ్లలో 3.5 లక్షల మందికి ఉపాధి లభించనుంది. దాదాపు 62 వేల ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. రాజధాని నగరంలో 300 కి.మీ సైకిల్‌, నడక మార్గాలు ఉంటాయి. ప్రజలు సైకిల్‌పై కార్యాలయాలకు వెళ్లేలా, పనులు చేసుకుని ఇంటికి వెళ్లవచ్చు. దారివెంట ఇరువైలా చెట్లతో పచ్చదనం కనిపిస్తుంది.

అమరావతి

అమరావతి

నగరాన్ని హరిత రాజధానిగా మార్చేందుకు బృహత్తర పథకంలో 40 శాతానికి కన్నా ఎక్కువ స్థలాన్ని పార్కులు, ప్రజాపయోగ ఖాళీ స్థలాల కింద పేర్కొంది.సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ నగరం చుట్టూ ఆధ్యాత్మిక స్థలాల్ని కలుపుతూ దాదాపు 250 కి.మీ ఆధ్యాత్మిక పర్యాటక వలయం నిర్మిస్తారు. ఒక ప్రాంతం నుంచి మరో ఆధ్యాత్మిక కేంద్రానికి చేరుకునేందుకు మెరుగైన ప్రజా రవాణా ఏర్పాట్లు కల్పిస్తారు.

 అమరావతి

అమరావతి

రాజధాని నగరంలో ఒకచోట నుంచి మరోచోటకు వేగంగా చేరుకునేందుకు 135 కిలోమీటర్ల (మెట్రో, జాతీయ హైస్పీడు) రైలు మార్గాలకు రూపురేఖలు సిద్ధం అయ్యాయి. నగరంలో దాదాపు 1,000 కి.మీ పొడవైన రోడ్లు వస్తాయి. అంతర్గత రహదారుల కనీస వెడల్పు 18 మీటర్లు ఉంది. ప్రాధాన్య స్థాయి మేరకు కేటగిరీల వారీగా గరిష్ఠంగా రోడ్డు వెడల్పు 100 మీటర్లుగా నిర్ణయించింది.

 అమరావతి

అమరావతి

ప్రజా రవాణా కీలకంరాజధాని కేంద్ర ప్రాంతంలో ప్రజా రవాణాకు పెద్దపీట వేశారు. మెరుగైన ప్రజా రవాణాతో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతారు. కేంద్ర ప్రాంతంలో 12 కి.మీ మెట్రోరైలు నెట్‌వర్క్‌, 15 కి.మీ బీఆర్‌టీఎస్‌ మార్గాలు ఉంటాయి. డౌన్‌టౌన్‌ రోడ్డు 7 కి.మీ.లో వస్తోంది. ప్రధాన, ఉప ప్రధాన రోడ్లు 26 కి.మీ, అనుసంధాన రోడ్లు 56 కి.మీ పొడవులో ఉంటాయి.

 అమరావతి

అమరావతి

ఏపీ నూతన రాజధాని ప్రపంచ దేశాలను తలదన్నే అత్యాధునిక హంగుల నగరం అవడమే కాకుండా పూర్తి 100 శాతం వాస్తు ప్రమాణాలతో నిర్మాణం కానుంది. ఉత్తరాన కృష్ణా నది ఉండటంతో నీటి ప్రవాహం ఉత్తరం నుంచి తూర్పూ ఈశాన్యం గుండా పారుతున్న క్రమంలో దానిని ఆధారంగా చేసుకొని నగర ప్లాన్‌ను రూపొందించారు. వాస్తు నియమాల ప్రకారం తూర్పు దిశగా అందునా ఉత్తరం నుంచి నీరు తూర్పుకు ఈశాన్యాన ఏటావాలుగా ప్రయాణిండాన్ని అత్యంత ఉత్కృష్టంగా భావిస్తారు. రాజధానికి దక్షిణ భాగంలో కొండ ప్రాంతం ఉండటం కూడా వాస్తుపరంగా కలిసి రానుందని అంటున్నారు. ఆగ్నేయం, నైరుతు ప్రాంతాల్లో భారీ స్థాయి పరిశ్రమలు ఏర్పడనున్నాయి. ఇవి వాస్తు ప్రకారం పరిశ్రమల ఏర్పాటుకు సరైన ప్రాంతాలు.

English summary
Envisaging "a smart, green and sustainable" city, the Singapore government presented Master Plan for the Seed Capital Area (SCA)' to AP CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X