రంగంలోకి ఈగిల్.. ఏపీలో ఆ పనిచేస్తే.. వారికి సంక్షేమపథకాలు కట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం, గంజాయిని పూర్తిగా రూపుమాపడం కోసం యుద్ధం ప్రకటించింది. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ను పూర్తిస్థాయిలో నియంత్రణ చేయాలని అందుకు ఇకపైన క్షేత్రస్థాయిలోకి వెళ్లి వీటిని అమ్ముతున్న వారిపైన, రవాణా చేస్తున్న వారిపైన, సాగు చేస్తున్న వారిపైన ఉక్కుపాదం మోపాలని ఏపీ మంత్రి నారా లోకేష్ ఆదేశాలు జారీ చేశారు.

ఇకపై మాదకద్రవ్యాల కట్టడికి ఈగిల్
నేడు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను నియంత్రణకు ఏర్పాటైన మంత్రుల ఉప సంఘం మూడవ సమావేశంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు చేపట్టవలసిన చర్యల పైన చర్చించారు. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హోం మంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశానుసారం ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ఫోర్స్ ను ఈగిల్ గా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Govt schemes will be cancelled to them who sells ganja in AP Eagle to erodicate drugs

గంజాయి సాగు ధ్వంసానికి డ్రోన్స్
ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ గా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కు నామకరణం చేశారు. ఇక గంజాయి సాగును కట్టడి చేయాలని, దీనిని కట్టడి చేయడానికి టెక్నాలజీని వాడుకోవాలని సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ సూచించారు. గంజాయి సాగు ధ్వంసం చేయటానికి డ్రోన్లను ఉపయోగించాలని ఆదేశించారు. గ్రామ స్థాయిలో పది మంది సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు.

గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారికి సంక్షేమం కట్
పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఇలా ప్రతిచోట ఈగిల్ కమిటీలతో మాదకద్రవ్యాలను నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి కేసుల్లో ఉన్న వారి ఫోటోలను ప్రత్యేక వెబ్సైట్లో, పోలీస్ స్టేషన్లో పొందుపరచాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఎవరైతే గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తారో వారి కుటుంబాలకు ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని కట్ చేయాలని సమావేశంలో పాల్గొన్న సభ్యులు అభిప్రాయపడ్డారు.

గంజాయి నియంత్రణకు కఠిన నిర్ణయాలు
ఇక గంజాయి సాగు చేయకుండా అవగాహన కల్పించడం మాత్రమే కాకుండా, వారికి ప్రత్యామ్నాయం కూడా కల్పిస్తున్నామని ఈ సమావేశంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడానికి వారికి కావలసిన సహాయాన్ని అందిస్తామని ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నట్టు ఆమె పేర్కొన్నారు. మొత్తంగా నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో గంజాయి, మాదకద్రవ్యాలతో తప్పుదారిన పోతున్న వారిని సక్రమ మార్గంలోకి తీసుకురావడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+