అనురాధ స్థానంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా: బెజవాడ పోలీస్ బాస్ కంటతడి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విజయవాడ నగర పోలీసు కమిషనర్ బీవీ వెంకటేశ్వర రావు మంగళవారం నాడు ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన కంటతడి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయనను ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా ప్రభుత్వం నియమించింది.

దీంతో ఆయన వెళ్లనున్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. నేరాలు అరిగట్టేందుకు నైట్ డామినేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు అది నైట్ సేఫ్టీగా కొనసాగుతుందని చెప్పారు.. పోలీసు అనేవాడు ఒక్కసారి కమిటైతే తన మాట తానే వినడని చెప్పారు.

Govt Transfers Intelligence Chief AR Anuradha, CP emotion

కాగా, ఏపీ నిఘా విభాగం అధిపతిగా అదనపు డీజీపీ స్థాయి అధికారి, విజయవాడ నగర కమిషనర్ ఎబి వెంకటేశ్వర రావును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఈ విభాగం చీఫ్‌గా ఉన్న అనురాధను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ విభాగం అదనపు డీజీపీగా నియమించారు.

ఎబి వెంకటేశ్వర రావు స్థానంలో ఏపీఎస్పీ బెటాలియన్స్ అదనపు డీజీపీ దామోదర్ గౌతమ్ సవాంగ్‌ను బెజవాడ నగర పోలీస్ కమిషనర్‌గా నియమించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+