Kodali Nani: గుడివాడలో కొడాలి నాని దుస్థితి చూశారా ?
ఒకప్పుడు గుడివాడలో ఆయనే కింగ్. దాదాపు 20 ఏళ్ల పాటు పార్టీలు మారినా గుడివాడను తన అడ్డాగా మార్చుకుని రాజకీయాలు నడిపిన సీనియర్ నేత. కానీ ఒక్క ఓటమి ఆయన పరిస్ధితి దారుణంగా మార్చేసింది. ఆయనే కొడాలి నాని. టీడీపీ, వైసీపీలో 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా గెలిచి కంటిచూపుతోనే రాజకీయాలు నడిపిన దిగ్గజ నేత కొడాలి నానికి అధికారం పోయాక మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. గుడివాడకు రావాలంటేనే కష్టంగా మారిపోయిన పరిస్ధితుల్లో ఇవాళ మరో భారీ షాక్ తగిలింది.
రెండు దశాబ్దాలుగా నిరాటంకంగా రాజకీయాలు చేస్తూ ఏ చిన్న కార్యక్రమం అయినా వేడుకగా జరుపుకునే కొడాలి నానికి గుడివాడ పోలీసులు భారీ షాకిచ్చారు. ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోకుండా అడ్డుతగిలారు. కొడాలి నాని పుట్టినరోజు వేడుకలకు సిద్ధమైన ఆయన అభిమానులు, అనుచరులకు భారీ షాక్ ఇస్తూ అనుమతి నిరాకరించారు. అంతే కాదు కొడాలి నాని ఫ్లెక్సీలు కూడా కట్టకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అంతే కాదు ఆయన అనుచరులకూ పోలీసులు హెచ్చరికలు చేస్తున్నారు.

గుడివాడ పట్టణంలో 20 ఏళ్లుగాా పోలీసులైనా, రాజకీయ నేతలైనా, రాజకీయమైనా కొడాలి నాని కన్నుసన్నల్లోనే సాగేది. ఆయన ఎంతంటే అంత. కొడాలి విజయాల్ని అడ్డుకోవడానికి గతంలో చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించి పలు మార్లు విఫలమయ్యారు కూడా. అయితే ఈఈసారి రాష్ట్రవ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో కొడాలి నాని కూడా కొట్టుకుపోయారు. ఆ ఓటమి ప్రభావం కొడాలికి అర్ధం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఇప్పుడు ఏకంగా పట్టణంలో పట్టినరోజు వేడుకలు కూడా నిర్వహించకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని బట్టి చూస్తే భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications