వైసీపీ రాజకీయంతో హనుమ విహారి తీవ్రనిర్ణయం... చంద్రబాబు స్పందన!!
టీమిండియా బ్యాటర్ , ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి ఆంధ్ర క్రికెట్ జట్టును వీడనున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2023- 2024 రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయి ఆంధ్ర జట్టు నిష్క్రమించిన అనంతరం హనుమ విహారి తన నిర్ణయాన్ని తెలియజేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని, ఇకపై ఆంధ్ర జట్టు కోసం ఆడబోనని ఆయన పేర్కొన్నారు.
ఏపీ రాజకీయాల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఒక రాజకీయ నేత ఒత్తిడితో తన తప్పు ఏమీ లేకున్నప్పటికీ తనను కెప్టెన్ నుంచి వైదొలగమన్నారు అని అసలు విషయం చెప్పిన హనుమ విహారి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ కారణంగా తాను ఎంతో బాధపడ్డాను అని తన ఆత్మ గౌరవం దెబ్బతిందన్నారు.

ఇకపై తాను ఆంధ్ర కోసం ఆడకూడదని నిర్ణయం తీసుకున్నానని తన సంచలన నిర్ణయాన్ని హనుమ విహారి వెల్లడించారు. హనుమ విహారి నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయాలపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. వైయస్సార్సీపి ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటు అంటూ చంద్రబాబు ఆ పోస్టులో వెల్లడించారు.
హనుమ విహారి ఒక తెలివైన భారత అంతర్జాతీయ క్రికెటర్ అని అలాంటి క్రికెటర్ కూడా ఆంధ్రప్రదేశ్ తరఫున ఎన్నటికీ ఆడనని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డాడు అని చంద్రబాబు ఆరోపించారు. ఇక ఇదే సమయంలో హనుమ విహారికి అండగా తాము ఉంటామని పేర్కొన్న చంద్రబాబు హనుమా.. మీరు దృఢంగా ఉండండి ఆట పట్ల మీ చిత్తశుద్ధి నిబద్ధత చాలా గొప్పది అని పేర్కొన్నారు.
It's a shame that even the Andhra Cricket Association has succumbed to YSRCP's vindictive politics. @Hanumavihari, a brilliant Indian international cricketer, has been targeted to the point where he has vowed to never play for Andhra Pradesh.
— N Chandrababu Naidu (@ncbn) February 27, 2024
Hanuma, stay strong - your integrity…
ప్రస్తుత అన్యాయమైన ఈ చర్యలు ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ప్రజల నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబించే చర్యలు కావు. మేము మీకు అండగా ఉండి, న్యాయం కోసం పోరాటం చేస్తామని క్రికెటర్ హనుమ విహారికి మద్దతును ప్రకటించారు చంద్రబాబు.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications