HBD CBN: జన్మదినం వేళ చంద్రబాబు టార్గెట్ - సమర్ధతకు పరీక్ష, లెక్క పక్కా..!!

ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినం. 74వ ఏట అడుగు పెడుతున్నారు. ప్రతీ సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవటం చంద్రబాబు ప్రత్యేకత. నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం.. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన రికార్డు.. 13 ఏళ్లు ప్రతిపక్ష నాయకుడిగా కీలక పాత్ర. రాజకీయంగా ఎన్నో విపత్కర పరిస్థితులను అధిగమించిన చంద్రబాబుకు ఇప్పుడు 2024 ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి.

ఇన్నాళ్ల రాజకీయ జీవితం.. పార్టీ భవిష్యత్ కు ఈ ఎన్నికలే దిక్సూచి. రాజకీయ చాణక్యుడిగా చంద్రబాబు ఖ్యాతి దక్కించుకున్నారు. AP Needs Babu Back Again అంటూ అభిమానులు నినదిస్తున్న వేళ ఈ జన్మదినం..ఈ ఏడాది చంద్రబాబు అనుభవం..రాజకీయానికి అసలైన పరీక్ష.

HBD Chandrababu : Fans go gaga trends AP needs babu back again

ఇప్పటి దాకా ఒక లెక్క..నేటి నుంచి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారా వారి పల్లెలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకొన్నారు. విద్యార్ధి నాయకుడిగా రాజకీయ రంగంలో ప్రవేశించి.. సమర్ధ వంతమైన నాయకత్వ లక్షణాలతో టీడీపీ అధినేతగా ఎదిగారు. 28 ఏళ్ల వ‌య‌సులో ఉమ్మడి ఆంధప్రదేశ్ లో అతి పిన్న వ‌య‌స్కుడైన ఎమ్మెల్యే, మంత్రిగా పేరు గాంచారు. ఏపీ ముఖ్యమంత్రిగాను పనిచేశారు. సంక్షోభాల నుంచి అవకాశాలు వెతకడం, ఎలాంటి కష్టాన్నైనా ఇష్టంగా మలచుకోవడం ఆయన నైజం.

ఆర్థిక సంస్కరణలను అందరూ వ్యతిరేకించినా స్వాగతించారు. ప్రజల నాడి తెలుసుకుంటూ కాలంతో పాటు పరిగెత్తే అలుపెరుగని పోరాటయోధుడు. ఐటీ, బీటీ రంగాలను ప్రోత్సహించి హైదరాబాద్‌ కు కొత్త రూపు ఇవ్వటంలో చంద్రబాబు ఇమేజ్ మరింత పెరిగింది. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసిన కేంద్రం పైన పోరాటంలో అందరినీ ఒకే తాటి మీదకు తెచ్చి..నాటి నుంచే ఆయన తన సత్తా చాటారు. ఇక, అప్పటి నుంచి టీడీపీలో సమర్ధవంతమైన నేతగా గుర్తింపు దక్కించుకున్నారు.

జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా: ఎన్టీఆర్ తో కలిసి నేషనల్ ఫ్రంట్ లో..ఆ తరువాత నేషనల్ ఫ్రంట్..యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల నిర్వహణలోనూ కీలకంగా మారారు. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎంపికలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక, రాజకీయంగా ఎన్టీఆర్ తరువాత సీఎం అయ్యే క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు నేటికి ఆయన్ను వెంటాడుతున్నాయి. ఇక, 2004..2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రకు పరిమితం అయ్యారు.

1995 -2004 వరకు సీఎంగా చంద్రబాబు హైదరాబాద్ పైన ప్రత్యేక ముద్ర వేసారు. ఇక, రాష్ట్ర విభజన తరువాత ఆయన అనూహ్యంగా 2014 ఎన్నికల్లో రాజకీయ నిర్ణయాలను పక్కగా అమలు చేయటంతో అధికారం దక్కించుకున్నారు. కానీ, 2019 ఎన్నికల సమయంలో బీజేపీతో తెగ తెంపులు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసారు. కానీ, చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీకి ఊహించని ఎదురు దెబ్బ తగలింది. కేవలం 23 స్థానాలకే టీడీపీ పరిమితం అయింది. తన రాజకీయ ప్రత్యర్ధి వైఎస్సార్ కుమారుడు జగన్ సీఎం అయ్యారు.

ఈ ఏడాదే కీలకం..సమర్ధతకు పరీక్ష: అయినా..నాడు వైఎస్సార్.. నేడు జగన్ తో ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేస్తున్నారు. పార్టీ సంక్షోభంలోకి వెళ్తుందనే భావన నుంచి తిరిగి అధికారం మనదే అనే నమ్మకం కలిగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి లోకేష్ ను సైతం రాజకీయంగా వెనుక ఉండి నడిపిస్తున్నారు. ఇక, చంద్రబాబుకు వ్యక్తిగతంగా.. పార్టీ పరంగా 2024లో అధికారం దక్కించుకోవాల్సిన పరిస్థితి. ఏ ఒక్క అవకాశం వదులుకోవటానికి సిద్దంగా లేరు.

పొత్తులు, వ్యూహాలు, సామాజిక - ప్రాంతీయ లెక్కలతో పక్కాగా అడుగులు వేస్తున్నారు. ఈ సారి అధికారం దక్కించుకుంటే టీడీపీకి పూర్వ వైభవం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. లెక్క తప్పితే జరిగే నష్టమూ తెలుసు. దీంతో, స్వయంగా ప్రతీ విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పార్టీ అధినేతగా జోష్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ నీడ్స్ బాబు బ్యాక్ అగైన్ అంటూ అభిమానులు నినాదం నిజం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+