Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తాడేపల్లిగూడెం: బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు, నలుగురు మృతి

పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కడియుద్ధలో బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మందికి గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో పది మంది ఉన్నట్లు తెలిసింది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

heavy blast in firecracker industry in west godavari district: four killed

అన్నవరం అనే వ్యక్తికి చెందిన బాణాసంచా కర్మాగారంలో ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. గ్రామశివారులోని చెరువు వద్ద బాణాసంచా కర్మాగారం ఉండటంతో ఘటనా స్థలికి ఫైరింజిన్ చేరుకోవడం కష్టసాధ్యంగా మారింది. కొంత దూరం నుంచే మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

కాగా, ఘటనా స్థలంలో మంటల్లో కాలిపోతున్న కార్మికులు హాహాకారాలు వినిపించాయి. మృతుల కుటుంబసభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఇది ఇలావుండగా, తమిళనాడు మదురైలోని బాణాసంచా కర్మాగారంలో కూడా గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఐదుగురు మృతి చెందారు. మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+