AP Rains: ఏపీకి భారీ వర్ష సూచన-ఎక్కడెక్కడంటే..
ఏపీకి మరోసారి భారీ వర్షాలు తప్పేలా లేవు. ఈ సీజన్ లో వర్షాభావ పరిస్ధితులతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణ అండమాన్ మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణ విభాగం ప్రకటించింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో భారీ వర్షాలు తప్పవని హెచ్చరిస్తోంది.
ఈ శనివారం నాటికి నైరుతి, ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇది తుఫానుగా మారే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో శనివారం నుంచి వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమ, కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అలాగే చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వెల్లడించారు. కాబట్టి ప్రజలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ విభాగం తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే పరిస్దితులు కనిపిస్తున్నాయి. దీంత ఇప్పటి నుంచే రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ విభాగం హెచ్చరికలు చేస్తోంది. అలాగే ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించింది. అసలే ఈ ఏడాది వర్షాభావ పరిస్దితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు ఈసారి అయినా వర్షాలు పడతాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. పలు జిల్లాల్లో నెలకొన్న కరవు పరిస్ధితులతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది.












Click it and Unblock the Notifications