వైఎస్ జగన్ హెచ్చరిక

అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ దీన్ని నిర్మిస్తోన్నారు. ఈ మూవీ షూటింగ్ ముగిసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకొంటోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపుదిద్దుకుంటోంది. వైఎస్ జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్‌ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్‌లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్.. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

Here is Deeksha song from RGVs vyooham film

వైఎస్ జగన్ పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను ఆయా ప్రాంతాల్లో చిత్రీకరించారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల పాదయాత్రలో పాల్గొన్న సన్నివేశాలను తెరకెక్కించారు. పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం, ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ నిర్వహించిన నిరాహార దీక్షా సన్నివేశాలను తీశారు.

ఇదివరకే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. 2009లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన నల్లమల అడవులను చూపించడంతో టీజర్ ఆరంభమౌతుంది. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది ప్రేక్షకుల నుంచి. ఈ టీజర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

వైఎస్ జగన్, భార్య వైఎస్ భారతి, తల్లి విజయమ్మ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్.. ఇలా అన్ని ప్రధాన పాత్రలూ ఈ టీజర్‌లో కనిపించాయి. మెగాస్టార్ చిరంజీవి పాత్రను కూడా పరిచయం చేశారు రామ్ గోపాల్ వర్మ. ఓ మంచి కాంటెంపరరీ పొలిటికల్ థ్రిల్లర్‌గా మార్చాయి ఈ మూవీని.

ఇక తాజాగా- వ్యూహం నుంచి లిరికల్ సాంగ్‌ను వదిలారు రామ్ గోపాల్ వర్మ. ఈ ఉదయం సరిగ్గా 9:15 నిమిషాలకు ఈ సాంగ్ యూట్యూబ్ లింక్‌ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. జగనుడి మౌన దీక్ష, జనం కోసం కార్యదీక్ష.. పావు కదుపుతున్న వారికి హెచ్చరిక అనే లిరిక్‌తో సాగుతుందీ పాట.

బాలీవుడ్ గాయకుడు సుఖ్వీందర్ సింగ్, సంగీత దర్శకుడు కీర్తన శేష్ ఈ పాటను ఆలపించారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేపట్టిన మౌనదీక్ష, భారీ సంఖ్యలో అభిమానులు దీనికి సంఘీభావాన్ని పలకడం, దీక్షను పోలీసులు భగ్నం చేయడం, ఆయనను అరెస్ట్ చేయడం వంటి సన్నివేశాలు ఇందులో కనిపిస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+