AP Nominations: జగన్, చంద్రబాబు, పవన్ సహా వీరి నామినేషన్ల ఆమోదం-వీరివి తిరస్కరణ..!

ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్ల స్క్రూటినీ(పరిశీలన) ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇవాళ ఉదయం ప్రారంభమైన ఈ ప్రక్రియలో పలు నామినేషన్లకు అధికారులు ఆమోద ముద్ర వేశారు. అలాగే మరికొన్నింటిని తిరస్కరించారు. ఆమోదం పొందిన నామినేషన్లలో సీఎం జగన్, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు అభ్యర్ధులు ఉన్నారు.

ఏపీలో పార్లమెంట్ ఎన్నికల కోసం దాఖలైన నామినేషన్లలో ప్రధాన పార్టీల అభ్యర్ధుల నామినేషన్లు దాదాపుగా ఆమోదం పొందుతున్నాయి. వీటిలో ఇప్పటివరకూ ఆమోదం పొందిన వాటిలో విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, బూడి ముత్యాలనాయుడు, వైఎస్ అవినాష్ రెడ్డి, వల్లభనేని బాలశౌరి, పెమ్మసాని చంద్రశేఖర్, దగ్గుమళ్ల ప్రసాదరావు, గంటి హరీష్ చంద్ర మాథుర్, రాపాక వరప్రసాద్, బైరెడ్డి శబరి, శంకర్ నారాయణ, కేశినేని చిన్ని, కిలారి రోశయ్య, అంబికా లక్షీనారాయణ, పోచ బ్రహ్మానందరెడ్డి, వైఎస్ షర్మిల ఉన్నాయి.

here is list of nominations accepted and rejected in andhra pradesh elections

అలాగే అసెంబ్లీ ఎన్నికలకు దాఖలైన నామినేషన్లలో వైఎస్ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగా గీత, గంటా శ్రీనివాస్, యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీ, నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీదిరి అప్పలరాజు, గౌతు శిరీష, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి,దస్తగిరి, బీటెక్ రవి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, మార్గాని భరత్, ఆదిరెడ్డి వాసు, ధర్మాన ప్రసాద్, నాదెండ్ల మనోహర్, వెల్లంపల్లి శ్రీనివాస్, బోండా ఉమ, సుజనా చౌదరి, ఎంవీవీ సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణ, వాసుపల్లి గణేష్, రఘురామకృష్ణంరాజు, తమన్నా సింహాద్రి వంటి వారు ఉన్నారు.

మరోవైపు రాష్ట్రంలో పలు అసెంబ్లీ, పార్లమెంట్ స్దానాల్లో అభ్యర్ధులు దాఖలు చేసిన అదనపు నామినేషన్లతో పాటు, ఇండిపెండెంట్లు, పలు చిన్న పార్టీల అభ్యర్ధులు దాఖలు చేసిన నామినేషన్లు ఇప్పటికే తిరస్కరణకు గురయ్యాయి. వీటి తిరస్కరణ వెనుక వేర్వేరు కారణాలు ఉన్నాయి. అలాగే మరికొన్ని నామినేషన్లు అదనపు వివరాల కోసం పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+