బావా! సూపర్, థ్యాంక్స్: టిడిపి ఎంపీ గల్లాకు మహేష్ బాబు (ఫోటోలు)
అమరావతి: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన బావ, తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్‌కు కితాబిచ్చారు. తాను దత్తత తీసుకున్న బుర్రిపాలెం గ్రామంలో ఎంపీ లాడ్స్ నిధులతోజయదేవ్ రోడ్లను మరమ్మతు చేయించారని ప్రిన్స్ పేర్కొన్నారు.
ఆయన సోషల్ మీడియా ఫేస్‌బుక్ ద్వారా తన బావను ప్రశంసించారు. మహేష్ బాబు బుర్రిపాలెం మెయిన్ రోడ్డుకు సంబంధించిన ఫోటోలను ఫేస్‌బుక్‌లో పెట్టారు. రోడ్లు బాగైన విధానం బాగుందని అభిప్రాయపడ్డారు.
జయదేవ్ ఎంపీ నిధులతో బాగు చేశారని, మద్దతుగా నిలబడుతున్నందుకు గల్లా జయదేవ్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. కాగా, మహేష్ బాబు బుర్రిపాలెం గ్రామాన్ని, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని మరో గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.
కాగా, మహేశ్ దత్తత తీసుకున్న బుర్రిపాలెం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. గ్రామంలోని డ్రెయిన్లు, రహదారులు మెరుగుపడ్డాయి. జయదేవ్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో డ్రైయిన్లు, రహదారుల మరమ్మతు పనులు చేపట్టారు.












Click it and Unblock the Notifications