బెంగళూరు రేవ్ పార్టీలో అతడ్ని చూసి షాకయ్యాను: హీరో శ్రీకాంత్

బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీ ఇప్పుడు సినీ, రాజకీయ ప్రముఖులలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. ఈ రేవ్ పార్టీలో సినీ పరిశ్రమకు చెందినవారు, డైరెక్టర్లు, హీరోలు, రాజకీయ ప్రముఖులు కొందరు మొత్తం 100 మంది పాల్గొన్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈ రేవ్ పార్టీలో భారీగా డ్రగ్స్ పట్టుబడినట్టు సమాచారం.

రేవ్ పార్టీ వార్తలపై స్పందించిన శ్రీకాంత్
అయితే ఈ రేవ్ పార్టీలో తెలుగు స్టార్ హీరో శ్రీకాంత్ కూడా ఉన్నారని పెద్ద ఎత్తున ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇక దీనిపై శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. తన ఇంటిలో, హైదరాబాద్లో ఉన్నానన్నారు. బెంగళూరు శివారు ప్రాంతంలో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని, అసలు తాను ఆ పార్టీకే వెళ్లలేదని శ్రీకాంత్ పేర్కొన్నారు. తాను హైదరాబాద్లోని తమ ఇంట్లోనే ఉన్నానన్నారు.

Hero srikanth reacted to the news of the Bangalore rave party

మా కుటుంబ సభ్యులంతా నవ్వుకున్నాం
నేను బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లినట్టు నన్ను అరెస్టు చేసినట్టు చాలామంది ఫోన్ చేసి మాట్లాడుతున్నారని ఆయన వాపోయారు. రేవ్ పార్టీకి సంబంధించిన వీడియో క్లిప్స్ చూసానన్నారు. కొంతమంది మీడియామిత్రులు తనకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకోవడం వల్ల తనకు సంబంధించిన వార్తలను రాయలేదన్నారు. ఇక కొన్ని మీడియా ఛానల్స్ లో తాను రేవ్ పార్టీకి వెళ్లానని రాసారని ఆ న్యూస్ చూసి మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నామన్నారు.

అతడ్ని చూసి షాకయ్యా.. నేనని నమ్మొద్దు
వార్తలు రాసిన వాళ్ళు తొందరపడడంలో తప్పులేదు అనిపించిందని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వ్యక్తి ఎవరో కానీ కొంచెం తనలాగే ఉన్నాడని అతనికి కాస్త గడ్డం ఉందని ముఖం కవర్ చేసుకున్నాడని పేర్కొన్నారు. అతన్ని చూసి తానే షాకయ్యా అని చెప్పిన శ్రీకాంత్ దయచేసి నేనే అక్కడ ఉన్నానంటే ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

రేవ్ పార్టీ ఎలా ఉంటుందో నాకు తెలీదు
తాను రేవ్ పార్టీలకు పబ్బులకు వెళ్లే వ్యక్తిని కానని, ఎప్పుడైనా బర్త్ డే పార్టీలకు వెళ్లినా కొద్దిసేపు మాత్రమే ఉండి వస్తానని చెప్పారు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా తనకు తెలియదన్నారు. విషయం తెలుసుకోకుండా రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ అంటూ థంబ్ నెయిల్స్ పెట్టేసి రాసేస్తున్నారని శ్రీకాంత్ అన్నారు. మీరు పొరపాటుతోనే రాస్తున్నారని నేను అనుకుంటున్నానని, దయచేసి తప్పుడు వార్తలను ప్రచురించొద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజలు కూడా తప్పుడు కథనాలు నమ్మకూడదని శ్రీకాంత్ కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+