రూ.80 లక్షలకు మోసపోయిన హీరోయిన్ రష్మిక
రష్మిక మందన్న.. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. కన్నడంలో కిరిక్ పార్టీద్వారా పరిశ్రమలోకి అడుగుపెట్టింది. చలో సినిమాద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమను కూడా పలకరించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. సినిమాలన్నీ హిట్ అవుతుండటంతో గోల్డెన్ లెగ్ అనే పేరు సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందారు.
తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు చేస్తూ రష్మిక మందన్న బిజీ బిజీగా ఉంటోంది. తాజాగా రష్మిక మోసపోయిందనే వార్త సినీ పరిశ్రమలో తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. రష్మిక హీరోయిన్ అయినప్పటినుంచి ఆమెదగ్గర ఒక వ్యక్తి మేనేజర్ గా చేస్తున్నారు. ఆ మేనేజర్ చేతిలో మోసపోయిందనే వార్త గుప్పుమంది.

రష్మికకు తెలియకుండా ఆ మేనేజర్ రూ.80 లక్షలను తస్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రష్మిక మేనేజర్ పై తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. తనను అడిగితే ఆ డబ్బులు ఇచ్చేదానన్ని, అలా కాకుండా నమ్మక ద్రోహం చేయడం తనకు ఏమాత్రం నచ్చడంలేదని మండిపడింది. క్షణాల వ్యవధిలోనే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రపంచంలో అన్నిటికంటే నమ్మక ద్రోహం చేయడమే అత్యంత దారుణమైన విషయమని, తన దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదంటూ పంపేసింది. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత రష్మిక టీం నుంచి మాత్రం ఎటువంటి స్పందనా రాలేదు. మేనేజర్ నిజంగానే మోసం చేశాడా? ఇదంతా ప్రచారమేనా? అనే విషయంపై రష్మిక స్పందిస్తేనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
-
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
కోకాపేట్ అల్లు సినిమాస్ లాంచ్ తేదీ అనౌన్స్: ఆ సినిమాలతో బోణీ -
Varanasi ఊచకోత.. కేవలం ఓవర్సీస్లో రైట్స్కే అన్ని రూ.కోట్లా? -
వీడియో వైరల్: స్నేహా రెడ్డికి ఖరీదైన బహుమతి ఇచ్చిన అల్లు అర్జున్.. -
ట్రైలర్ కే థియేటర్లు తగలబడుతున్నాయి.. ఇక సినిమా రిలీజ్ అయితే..!! -
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications