Holi 2024: ఏపీలో 60అడుగుల హోలీ టవర్: తాజంగి గిరిజనుల హోలీ చాలా స్పెషల్!!

హోలీ పండుగకు దేశం అంతా సంబరాలు జరుపుకుంటుంది. చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగుల పండుగను ఆనందోత్సాహాల నడుమను జరుపుకుంటున్నారు. హోలీ రోజు ఎవరైనా రంగులు చల్లుకుంటారు. రంగుల కేళి రంగేళి, సంబరాల హోలీ అంటూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. ఇష్టంలేని వారు హోలీకి దూరంగా ఉంటారు. కానీ హోలీ నాడు చాలా ప్రాంతాల్లో అనేక వింత ఆచారాలను కొనసాగిస్తున్నారు.

హోలీ పండుగ నాడు చాలా చోట్ల విశేష వేడుకలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల జరుగుతున్న వేడుకలు చాలా స్పెషల్ గా నిలుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని తాజంగి బీటాలైన్ లో ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం శుక్లపక్షం రోజున హోళీ పండుగ నిర్వహిస్తారు. అయితే ఇక్కడ నిర్వహించే హోలీకి ఒక విశేషం ఉంది.

Holi 2024 60ft Holi Tower with firewood in AP Tajangi Tribal Holi is very special

ఈ ప్రాంత పూర్వీకులు ఒడిస్సా నుంచి ఈ ప్రాంతానికి వలస వచ్చినవారు కావటంతో ఇక్కడ హోలీ పండుగ అనాదిగా వారి ఆచారాల ప్రకారం నిర్వహిస్తున్నారు. పెద్ద కట్టెల టవర్ ఏర్పాటు చేసి దానిని దహనం చేసి వేడుక చేసుకుంటారు. .అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలోని తాజంగి గ్రామంలో ఆదివారం నుండే హోలీ వేడుకలు ప్రారంభం అయ్యాయి.

నిన్న ఉదయాన్నే 6 గం.నుంచి రాధాకృష్ణుల స్వామి వారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు,హోమం కార్యక్రమం నిర్వహించారు. నిన్న సాయంత్రం శ్రీశ్రీ రాధాకృష్ణులు,శ్రీ పాకలపాడు గురుదేవుల విగ్రహ ప్రతిమలు అంగరంగ వైభవంగా,గిరిజన సాంప్రదాయాలతో కోలాటం,తప్పట గుళ్లు,ఆదివాసీ నరేనరే నృత్యాలతో గుడి వద్ద నుంచి గ్రామ పురవీధుల్లో భారీగా ఊరేగించారు.

అంతేకాదు నేడు తెల్లవారుజామున సుమారు 4 గం.లకు అత్యంత భక్తిశ్రద్ధలతో సుమారు 60 అడుగుల ఎత్తులో కట్టెలతో నిర్మించిన హోళీ టవర్ పై జెండాను కట్టి వేడుకను కొనసాగిస్తున్నారు. ఆపై వేద మంత్రాలతో భక్తప్రహ్లాద హోమం చేసి కట్టెల టవర్ ను వెలిగిస్తారు. టవర్ పై జెండా ఎటు వైపు పడుతుందో అటువైపు ప్రాంతంలో పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామస్తులు నమ్ముతారు.

అంతేకాదు హోలీ టవర్ పై కట్టిన జెండా పడిపోయే సమయంలో యువకులు జెండా దక్కించుకోవటానికి పోటీ పడతారు. ఎవరైతే జెండాను పట్టుకుంటారో వారికి నగదు బహుమతిని ఇస్తారు. ఊరంతా ఊరేగిస్తూ ఆయనను ఇంటి దాకా తీసుకువెళ్తారు. ఇక ఈ ఏడాది వ్యవసాయమంతా జెండా పట్టుకున్న వ్యక్తి ద్వారానే చేస్తారు. ఆయనతోనే విత్తనాలు విత్తి వ్యవసాయ పనులు చేస్తారు. అప్పుడే దిగుబడులు బాగా వస్తాయని నమ్ముతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+