వలంటీర్లపై ఆరోపణలకు ఆధారాలున్నాయా పవన్..?!
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వలంటీర్లపై చేసిన ఆరోపణల దుమారం తగ్గట్లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు చేపట్టిన నిరసన ప్రదర్శనల తీవ్రత కొనసాగుతూనే ఉంది. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరించారు.
మానవ అక్రమ రవాణాకు వలంటీర్లు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. మలిదశ వారాహి యాత్ర సందర్భంగా ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వలంటీర్లను తప్పుపట్టారు. రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారు అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ఆరోపించారు.
ఇప్పుడు మళ్లీ పవన్ కల్యాణ్ అలాంటి వ్యాఖ్యలే చేశారు. వలంటీర్లు తొలుత ఇళ్లపై రెక్కీలు నిర్వహిస్తోన్నారని, అనంతరం ఒంటరి ఆడపిల్లలను టార్గెట్ చేస్తోన్నారని అన్నారు. తల్లిదండ్రులు పనులకు వెళ్లినప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండే ఆడపిల్లలపై దాడులు చేయడానికి అవకాశాలను వెదుక్కుంటోన్నారని ఆరోపించారు. లొంగని అమ్మాయిలను పథకాలు తొలగిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని ధ్వజమెత్తారు.

ఈ వ్యాఖ్యలపై తాజాగా హోం శాఖ మంత్రి తానేటి వనిత స్పందించారు. పవన్ కల్యాణ్‌పై ఘాటు విమర్శలు చేశారు. వలంటీర్లపై చేసిన ఆరోపణలు, విమర్శలను తోసిపుచ్చారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడంటూ ధ్వజమెత్తారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలంటూ నిలదీశారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పని చేసిన వలంటీర్లపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
ఏదిపడితే అది గాలికి మాట్లాడటం మంచి పద్ధతి కాదని తానేటి వనిత చెప్పారు. గౌరవప్రదమైన ఉద్యోగాన్ని చేస్తోన్న లక్షలాది మంది వలంటీర్లందరినీ పవన్ కల్యాణ్ అవమానిస్తోన్నాడని, వారిని కించపరుస్తోన్నాడంటూ ఆమె విమర్శించారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి సమాచారం ఉంటే దాన్ని బయటపెట్టడానికి ఎందుకు సంకోచిస్తున్నాడని ప్రశ్నించారు.
వలంటీర్లు ఏ స్థాయిలో ప్రజలకు సేవలు అందిస్తోన్నారనేది అందరికీ తెలిసిన విషయమేనని, వారిని విమర్శించడం ద్వారా పవన్ కల్యాణ్ దిగజారిపోయారని తానేటి వనిత అన్నారు. వలంటీర్ల వ్యవస్థ, గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తోండటాన్ని భరించలేకపోతున్నాడని చెప్పారు. చంద్రబాబు రాసిన స్క్రిప్ట్‌ను ఆయన చదువుతున్నాడని ఎద్దేవా చేశారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications