మాంసం కొడుతూ బాలయ్య భామ హాట్ బ్యూటీ హనీరోజ్; ఫ్యాన్స్ కు సర్ప్రైజ్!!
వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబు సరసన నటించి సూపర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హనీ రోజ్. ఆ తర్వాత వెంటనే హనీ రోజ్ సినిమాలలో బిజీ అయిపోతుందని అందరూ భావిస్తే అందుకు భిన్నంగా హనీ రోజ్ అభిమానులను నిరాశపరిచింది. సోషల్ మీడియాలో తన క్రేజీ ఫోటోలతో అందరి మతులు పోగొడుతున్న హనీ రోజ్ కు వెంటనే సినిమాలలో అవకాశం రాకపోవడం అభిమానులను షాక్ కు గురి చేసింది.
అయితే ఇప్పుడు తాజాగా అభిమానులందరూ సంతోషపడే శుభవార్త చెప్పింది హనీ రోజ్. ఒక పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇప్పటివరకు తనదైన క్లాస్, హాట్ ఫోటోలతో అందరి మనసులను దోచుకున్న ఈ భామ ఇప్పుడు ఊహించని మాస్ ఫోటోతో ప్రతి ఒక్కరి ఫోకస్ తనపైన ఉండేలా చేసింది.

రానున్న సినిమాలో ఒక మాస్ రోల్ లో హనీ రోజ్ కనిపించనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ చూస్తేనే ఒక్కొక్కరి మతులు పోతున్నాయి అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గత ఆరేడు నెలలుగా హనీ రోజ్ సినిమా అనౌన్స్మెంట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే నిరాశలో ఉన్న అభిమానులకు తాజాగా ఆమె తన కొత్త సినిమాను పాన్ ఇండియా స్థాయిలో అనౌన్స్ చేసింది.
హనీ రోజు నటించబోయే సినిమా వివరాలు చూస్తే ఈ సినిమా పేరును ఇంగ్లీషులో rachel అని తెలుగులో రాహేలు అని ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో హనీ రోజ్ కత్తి పట్టుకొని సీరియస్ గా మాంసం కొడుతూ కనిపించింది. ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు కనిపిస్తున్నాయి.
కేవలం ఒంటిపైన లంగా, జాకెట్ తో చాలా సీరియస్ పోజ్ లో హనీ రోజ్ పోస్టర్ ఉంది. ఆమె గొడ్డు మాంసం అమ్మే ఒక దుకాణం దారురాలిలా ఒక పాత్ర చేస్తుందని అర్థమవుతుంది. ఈ పోస్టర్ చూసిన వాళ్లంతా ఏదైనా నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ పోషిస్తుందా అని ఆలోచిస్తున్నారు. సూపర్ గ్లామరస్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ ఇలాంటి మాస్ రోల్ లో ఎట్లా మెప్పించగలుగుతారు అన్నది అందర్నీ ఆలోచించేలా చేస్తుంది.












Click it and Unblock the Notifications