ఏపీలో ప్రచండ భానుడు.. ఉక్కపోతతో జనం విలవిల; నేడు ఈ జిల్లాలవారు జాగ్రత్త!!

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్లో విధ్వంసం సృష్టిస్తుంటే, రెమాల్ తుఫాను ప్రభావం నుండి తప్పించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఏపీలో ఎండలు మండనున్నాయని, తీవ్ర వడగాలులు వీయనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రజలు మరో మూడు రోజులపాటు సూర్యుడి భగభగ ల నుంచి తమను తాము కాపాడుకోవాలని సూచించింది.

నేడు 149మండలాల్లో తీవ్రవడగాల్పులు
రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండ ప్రభావం చూపనున్నట్లు విపత్తు నిర్వహణా సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. నేడు 149మండలాల్లో తీవ్రవడగాల్పులు వీయనున్నాయని, 160మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, రేపు 195 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 147మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Hot summer in ap severe heat wave in these districts today alert to people

ఉక్కపోతతో ఏపీ విలవిల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 670మండలాలలో 361మండలాలలో వడగాలుల ప్రభావం ఉండబోదని, మిగతా మండలాల వారు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఐఎండి అంచనాల ప్రకారం తీవ్ర వడగాలులు వీచే మండలాలలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలుగా ఉన్నా కానీ అక్కడ 47డిగ్రీల ఉష్ణోగ్రతలా, వడగాలులు వీచే చోట 45డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు, వడగాలుల ప్రభావం లేని చోట 44.5డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టు ప్రజలు అనుభూతి చెందుతారని, ఉక్కపోతతో ఇబ్బందిని ఎదుర్కొంటారని చెబుతున్నారు.

ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త
ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పార్వతీపురం మన్యం, కోనసీమలోని కొన్ని ప్రాంతాలు, కాకినాడ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, ఏలూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, అనకాపల్లి జిల్లాలో తీవ్ర వడగాలుల ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ ప్రజలు ఎండ సమయంలో బయటకు వెళ్లొద్దని, తీవ్ర వడగాలుల నుండి కాపాడుకోవాలని అంటున్నారు.

నిన్న ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదైంది ఇక్కడే
కాగా నిన్న ఏపీలోని తిరుపతి జిల్లా సత్యవేడులో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు,నెల్లూరు జిల్లా మనుబోలులో 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత,బాపట్ల జిల్లా వేమూరు, కృష్ణా జిల్లా పెడనలో 40.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.వృద్దులు,గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+