వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణకు ‘సూపర్ స్టార్ అనే బిరుదు’ ఎలా వచ్చిందంటే..

|
Google Oneindia TeluguNews

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పట్టుదలకు ప్రతీకగా, సాహసానికి చిరునామాగా నిలిచారు సూపర్ స్టార్ కృష్ణ. 'ఆంధ్రా జేమ్స్‌బాండ్‌' అంటూ కొందరు అభిమానులు పిలుచుకుంటారు. మరికొందరు 'డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరో' అంటూ పొగడ్తలు కురిపిస్తారు. ఇంకొందరు సూపర్‌స్టార్‌ కృష్ణ అని పిలుచుకుంటారు. సినిమాల్లో ఆయన చేసిన ప్రయోగాల వల్ల 'జేమ్స్‌బాండ్‌', 'డేరింగ్‌, డాషింగ్‌'గా గుర్తింపు పొందారు. కృష్ణ సూపర్‌స్టార్‌ ఎలా అయ్యారో చూద్దాం.

కొన్ని వందల సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన మిమ్మల్ని ఏ ఒక్క అవార్డుతోను ప్రభుత్వం గుర్తించకపోవడంపై మీ అభిప్రాయం ఏమిటి? అనే ప్రశ్నకు కృష్ణ నవ్వుతూ ఇలా జవాబిచ్చారు. ప్రభుత్వాలు గుర్తించలేదని తానెప్పుడూ బాధపడనని, ప్రజల గుర్తింపు ఉంటే చాలని, అవార్డులకంటే పెద్దదని భావిస్తానన్నారు. ప్రభుత్వాలు ఇవ్వకపోయినా ఫిల్మ్ ఫేర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అందుకున్నానని, అంతం కాదిది సినిమాకు ఉత్తమ నటుడిగా ఒక ప్రముఖ మ్యాగజైన్ నుంచి అవార్డు స్వీకరించినట్లు తెలిపారు.

how krishna got super star tag

అలాగే ఓ సినీ పత్రిక సూపర్ స్టార్ ఎవరు అనే అంశంపై బ్యాలెట్ పోటీ నిర్వహించింది. అందులో 5 సంవత్సరాలు వరుసగా సూపర్ స్టార్ అనే గౌరవం దక్కింది. అప్పటినుంచి అందరూ తనను సూపర్ స్టార్ కృష్ణ అని పిలవడం ప్రారంభించారని చెప్పారు. 2009లో భారత ప్రభుత్వం ఆయనకు 'పద్మ భూషణ్‌' పురస్కారాన్ని అందజేసింది. అక్కినేని నాగేశ్వరరావుని చూసి కథానాయకుణ్ని కావాలనుకున్నానని, చదువు పూర్తయిన వెంటనే తన కల నెరవేరిందన్నారు. నటుణ్నికాకపోయుంటే అనే ఆలోచనకు అసలు తావే లేదన్నారు.

English summary
Superstar Krishna is the epitome of perseverance and adventure in the Telugu film industry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X