భారీగా పెరిగిన బంగారం ధరలు: కొనలేనంతగా.. తెలుగురాష్ట్రాల్లో లేటెస్ట్ ధరలిలా!!

బంగారం ధరలు ఆకాశాన్ని చేరుతున్నాయి. కొనుగోలు చేయాలని భావించే వారికి బాబోయ్ కొనలేము అనే పరిస్థితిని తీసుకువస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు షాక్ కొడుతున్నాయి. కాస్త బంగారం ధర తగ్గిందని సంతోషపడే లోపే మళ్ళీ బంగారం ధర విపరీతంగా పెరగడం బంగారం ప్రియులకు నిరాశను కలిగిస్తుంది. తాజాగా మరోసారి పెరిగిన బంగారం ధరలు జీవన కాల గరిష్టాలను నమోదు చేశాయి.

నేడు 22క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు 58 వేల 200 రూపాయలు కాగా, 24క్యారెట్ల బంగారం ధర 10గ్రాములకు 63 వేల 490 రూపాయలుగా నమోదయింది. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 58వేల రూపాయలుగా ఉంది. నేడు ఆ ధర 200 రూపాయలు పెరిగింది. నిన్న 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర 63,230 గా ఉంది. నిన్నటితో పోలిస్తే నేడు 260రూపాయలు ధర పెరిగింది.

 Huge rise in gold prices: Here is the Latest gold prices in Telugu states!!

నేడు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం ఈ సమయానికి 58,350 రూపాయలుగా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 63,640 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రస్తుతం ఈ సమయానికి 22 క్యారెట్ల బంగారం ధర 58,200 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 63,490 రూపాయలుగా కొనసాగుతుంది.

హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 58,200 రూపాయలుగానూ, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 63 వేల 490 రూపాయలు గానూ ప్రస్తుతం కొనసాగుతుంది. విపరీతంగా పెరుగుతున్న బంగారం ధరలు ఎప్పుడు మళ్ళీ కొండ దిగుతాయా అని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే దేశీయ మార్కెట్లో వెండి ధరలు తగ్గుతున్నాయి.దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర 79 వేల రూపాయలుగా ఉంది. బెంగళూరులో 77000, ఢిల్లీ, ముంబై, కలకత్తా, పూణే లలో కిలో వెండి ధర 79 వేలుగా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలలో కిలో వెండి ధర 80 వేల 500 రూపాయల వద్ద ప్రస్తుతం కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+