• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కీలక వ్యాఖ్యలు..! నాకు దేవుడు వెంకటేశ్వరుడు.. నాయకుడు వైఎస్ జగన్

|

హైదరాబాద్: తాను ఇక రాజకీయాలు మాట్లాడబోనని ప్రముఖ హాస్యనటుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పృథ్వీ అన్నారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించారని చెప్పారు. తాను ఓ బాధ్యతాయువతమైన స్థానంలో ఉన్నందున రాజకీయాలు మాట్లాడబోనని అన్నారు. అలాగని- వైఎఎస్ఆర్సీపీకి చెందిన ఓ కరడుగట్టిన ఉగ్రవాది గొంతు మూగబోయిందని అనుకోవద్దని చెప్పారు. తాను రాజధాని ప్రాంతానికి వెళ్తే తమ జగన్ అన్న పక్కన గన్ లా ఉంటానని అన్నారు.

చంద్రయాన్ 2 పంపిన అసలు పిక్స్ వచ్చేసాయ్!! 5000 కిలోమీటర్ల ఎత్తు నుంచి భూగోళం

 హారతి కర్పూరంపై ప్రమాణం..

హారతి కర్పూరంపై ప్రమాణం..

ఆదివారం ఆయన హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి తనను శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ గా నియమించినందున కొండ మీద గానీ, కొండ కింద గానీ రాజకీయాలు మాట్లాడనని కర్పూర హారతి మీద ప్రమాణం చేశానని అన్నారు. ఎవరు మాట్లాడినా తనకు పట్టింపు లేదని, తాను మాత్రం నిబద్ధతతో ఉంటానని చెప్పారు. తిరుమలలో రాజకీయ అంశాలు గానీ, పార్టీల గురించి మాట్లాడనని అన్నారు. ఓ నటుడిగా లైట్ బోయ్ తో కూడా కలిసి తిరిగిన అనుభవం తనకు ఉందని, అదే విధానాన్ని ఎస్వీబీసీలో ప్రవేశపెడతానని అన్నారు. తనకు ఇగోలు లేవని, అందర్నీ కలుపుకొని వెళ్తానని చెప్పారు.

నా దేవుడి మీద, నా నాయకుడి మీద ఎవరు మాట్లాడినా..

నా దేవుడి మీద, నా నాయకుడి మీద ఎవరు మాట్లాడినా..

తాను ఆరాధించే దేవుడి మీద గానీ, తాను అభిమానించే వైఎస్ జగన్ మీద గానీ ఎవరు విమర్శలు కురిపించినా, ఊరుకునేది లేదని పృథ్వీ హెచ్చరించారు. తన మాటలు తూటాల్లా పేలుతాయని అన్నారు. వారిని చీల్చి చెండాడతానని అన్నారు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి భక్తునిగా, అమరావతిలో వైఎస్ జగన్ కు, పార్టీకి విధేయుడిగా ఉంటానని చెప్పారు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించడం పట్ల తనకు ఆనందంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఘన విజయాన్ని నమోదు చేయాలని తాను ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడానికి ముందే కాలినడకన తిరుమలకు వెళ్లానని గుర్తు చేశారు. పార్టీ విజయం సాధించాలని తప్ప తాను మరొకటి కోరుకోలేదని అన్నారు.

పోసానితో విభేదాలా?

పోసానితో విభేదాలా?

తన తోటి నటుడు, పార్టీ నాయకుడు పోసాని కృష్ణ మురళితో తనకు ఎలాంటి విభేదాలు లేవని పృథ్వీ అన్నారు. ఇదంతా మీడియా సృష్టించిందేనని చెప్పారు. పోసాని తనకు సోదరుడితో సమానమని అన్నారు. భవిష్యత్తులో ఆయనకు మంత్రిపదవి ఖాయమని పృథ్వీ జోస్యం చెప్పారు. ఎస్వీబీసీలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయనే విషయం తన దృష్టికి వచ్చిందని, వాటిని సరి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఛానెల్ పనితీరుపై అవగాహన ఏర్పరచుకోవడానికి ప్రస్తుతం తాను తిరుపతి, హైదరాబాద్ కార్యాలయాల్లో అధిక సమయాన్ని కేటాయిస్తున్నానని చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగులు సంస్థలో పేరుకుపోయిన లోపాలను తనకు వివరించారని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party senior leader and Sri Venkateswara Bhakthi Channel Chairman Prithvi told that, I am loyal of the Party. He spoke in Press Conference arranged at Press Club in Hyderabad. As SVBC Channel Chairman I don't want to much talk about the Politics on the top of Tirumala or Tirupati, He said. I have to Concentrate only on the issue in the SVBC Channel, Prithvi added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more