బాహుబలికి చంద్రబాబు ప్రశంస, ఉబ్బితబ్బిబ్బయిన రాజమౌళి

హైదరాబాద్: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా తారాగణంగా, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు ప్రశంసలు కురిపించారు.

రాజమౌళికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. బాహుబలి లాంటి ఓ కళాఖండాన్ని తీసి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయిలో ప్రదర్శించారని ఆదివారం నాడు చంద్రబాబు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా అభినందించారు.

వెంటనే రాజమౌళి కూడా ప్రతిస్పందించారు. మీ అభినందనలతో మా చిత్రబృందం మొత్తం ఉప్పొంగిపోతోందని ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

 'I congratulate ssrajamouli and team for creating a masterpiece like Baahubali'

బాహుబలి సినిమాపై, దాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఇండియన్ సినిమా చరిత్రలో రాజమౌళి ఒక అద్భుతమైన సినిమా తీసారని, హాలీవుడ్ రేంజి సినిమా తీసారని, తెలుగు సినిమా రేంజిని పెంచారని పలువురు ప్రశంసిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ లీడర్ నారా లోకేష్ కూడా అంతకుముందు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.... ‘బాహుబలి లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళికి అభినందనలు తెలుపుతున్నాను. తెలుగు సినిమాను కొత్త లెవల్‌కి తీసుకెళ్లారు' అని ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+