100x150, నేనలాకాదు!: బాలకృష్ణ పంచ్ చిరుకేనా?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసన సభ్యుడు, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సహ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి పైన సెటైర్ వేశారా? అంటే కావొచ్చుననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు. ఇటీవల బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

తాను ఇదే దర్శకుడితో తీయాలని పట్టుబట్టనని, తాను దర్శకుల వెంట పడే నటుడిని కాదని, తాను సినిమాలను రికార్డుల కోసం చేయనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు చిరంజీవిని ఉద్దేశించి చేసి ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Chiranjeevi - Balakrishna

ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం, అనంతరం కాంగ్రెసు పార్టీలో విలీనం చేయడం, కేంద్రమంత్రి కావడం.. ఇలా నిన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న చిరంజీవి ప్రస్తుతం తన 150వ చిత్రం పైన దృష్టి సారించారు. చిరు అభిమానులతో పాటు అందరు చిరంజీవి మైల్ స్టోన్ చిత్రం పైన ఆసక్తితో ఉన్నారు. అదే సమయంలో త్వరలో బాలకృష్ణ వందవ చిత్రం రానుంది. బాలకృష్ణ శత చిత్రం పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

చిరంజీవి 150వ చిత్రం కోసం వివి వినాయక్, బోయపాటి శ్రీను, కృష్ణవంశీ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణవంశీకి రామ్ చరణ్ తేజ ఆఫర్ కూడా ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చేసిన.. ఇదే దర్శకుడితో తాను తీయాలని పట్టుబట్టనని, రికార్డుల కోసం సినిమా చేయనన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

చిరంజీవి 150వ సినిమా తీయబోతుండగా.. తన వందో చిత్రం గురించి బాలకృష్ణ మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. దీంతో పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించక ముందు టాలీవుడ్లో బాలకృష్ణ, చిరంజీవిల మధ్య పోటా పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, బాలకృష్ణ ఎవరినీ టార్గెట్‌గా చేసుకొని ఈ వ్యాఖ్యలు చేయలేదని, సందర్భాన్ని బట్టి మాట్లాడితే.. దాని పైన అనుమానాలు, ఊహాగానాలు చెలరేగటం బాధాకరమనే వారు కూడా లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+