కూల్ వ్యాపారం.. తక్కువ పెట్టుబడి.. ఎక్కువ ఆదాయం!
మీరు సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటుంటే మీ కోసమే ఈ వ్యాపారానికి సంబంధించిన సలహా. మనదేశంలోని చాలా ప్రాంతాల్లోని వాతావరణం అత్యధికంగా వేడితో కూడుకున్నవే ఉంటాయి. చల్లగా ఉండే కొడైకెనాల్ ఊటీ లాంటివి చాలా చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో నష్టాలు రాకుండా తేలిగ్గా చేసుకునే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లాభం మాత్రం ఎక్కువే ఉంటుంది. పెట్టుబడి చాలా తక్కువలో పెట్టుకోవచ్చు. అదే ఐస్ క్రీమ్ పార్లర్ వ్యాపారం.
వేసవి రోజుల్లో ఐస్ క్రీమ్స్ కు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు అందరూ కాలాలతో సంబంధం లేకుండా వర్షాకాలమైన, వేసవి కాలమైనా, చలికాలమైనా.. 365 రోజులపాటు ఐస్ క్రీమ్స్ ను తింటున్నారు. పెట్టుబడి విషయానికొస్తే దీన్ని కేవలం రూ.20వేల పెట్టుబడితో కూడా ప్రారంభించవచ్చు.

వ్యాపారం రోజురోజుకు పెరుగుతున్న కొద్దీ పెట్టుబడిని పెంచుకుంటూ వెళ్లవచ్చు. 400 చదరపు అడుగుల్లో లేదంటే 300 చదరపు అడుగుల్లో ఈ పార్లర్ ను ప్రారంభించవచ్చు. ఇందులో కనీసం ఐదుగురి నుంచి పదిమంది వరకు కూర్చునేలా ఏర్పాటు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా ఐస్ క్రీమ్ పార్లర్ వ్యాపారం ఒక బిలియన్ డాలర్లు దాటుతుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నివేదిక పేర్కొంటోంది.

ముందుగా పార్లర్ ప్రారంభించాలనుకునేవారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నెంబరు. మీ స్థలంలో తయారుచేసిన ఆహార పదార్థాలు, దాని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి అనే విషయాన్ని ఈ రిజిస్ట్రేషన్ నెంబరు నిర్థారిస్తుంది.

దేశంలోనే పేరెన్నికగన్న మంచి మంచి ఐస్ క్రీమ్ కంపెనీలు ఫ్రాంఛైజీ ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. ఇందుకు కనీసం 300 చదరపు అడుగుల స్థలం కావాల్సి ఉంటుంది. ఐస్ క్రీం వ్యాపారంలో లాభాలు ఏవిధంగా ఉంటాయంటే.. అవి తయారుచేయడానికి మీరుఎటువంటి ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారనేదానిపై ఆధారపడివుంటుంది.












Click it and Unblock the Notifications