పోకిరి పోరి.. తల్లయింది- మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా- వెరైటీగా పేరు
హైదరాబాద్: ఇలియానా. టాలీవుడ్‌ను ఒకప్పుడు ఒక ఊపు ఊపిన హీరోయిన్. ఎన్నో సూపర్ హిట్స్ మూవీల్లో మెరుపులు మెరిపించింది. రామ్ పోతినేని సరసన దేవదాసుతో ఎంట్రీ ఇచ్చిన తరువాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. పోకిరి, జులాయి, రాఖీ, మున్నా, జల్సా, శక్తి, నేను నా రాక్షసి.. వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. పోకిరి పోరీగా తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది.
బర్ఫీ మూవీతో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. హ్యాపీ ఎండింగ్, రుస్తుం, ముబారకన్, బాద్షాహో, రైడ్, పాగల్ పంతీ, ది బిగ్ బుల్.. సినిమాల్లో నటించింది. తెలుగులో ఇలియానా నటించిన చివరి మూవీ అమర్ అక్బర్ ఆంథోని. ప్రస్తుతం హిందీలో అన్ ఫెయిర్ అండ్ లవ్లీ, లవర్స్ సినిమాలతో బిజీగా ఉంటోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరమైంది. తెలుగు తెరకు దూరమైనప్పటికీ ఫ్యాన్స్‌ను మాత్రం సోషల్ మీడియాలో పలకరిస్తూనే ఉంది. పెళ్లి కాకుండానే తళ్లయింది ఇలియానా. తాను ప్రెగ్నెంట్ అని సింబాలిక్‌గా చెబుతూ కొద్ది రోజుల కిందటే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఓ ఫొటోను పోస్ట్ చేసింది. బేబీ బంప్‌తో కనిపించిందా ఫొటోల్లో.
అప్పట్లో బ్లాక్ డ్రెస్‌లో బేబీ బంప్‌ను చూపిస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. బంప్ అలర్ట్ అని కోట్స్‌లో పెడుతూ పోస్ట్ చేసింది. ప్రెగ్నెంట్ అయినట్లు బయట ప్రపంచానికి చెబుతూ అడ్వెంచర్ బిగిన్స్, త్వరలోనే నా బిడ్డను కలుసుకోబోతున్నాను అంటూ కామెంట్స్‌ను వాటికి జత చేసింది.

ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఇల్లీ బేబ్. పేరు కూడా పెట్టేసింది. కోవా ఫీనిక్స్ డోలన్ (Koa Phoenix Dolan) అని తన మగబిడ్డకు నామకరణం చేసినట్లు తెలిపింది. ఆ చిన్నారి ఫస్ట్ ఫొటోను కూడా తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై షేర్ చేసింది ఇలియానా. బాబు నిద్రపోతున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను ఇలియానా పోస్ట్ చేసింది. ఇంట్రడ్యూసింగ్ కోవా ఫీనిక్స్ డోలన్ అంటూ కామెంట్స్ పెట్టింది. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు రావట్లేదని పేర్కొంది.

కత్రినాకైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో ఇలియానా డేటింగ్‌లో ఉంది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌తో ఎప్పుడూ ఇలియానా సెబాస్టియన్ జోడి కనిపించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలొచ్చాయి అప్పట్లో. వారంతా మాల్దీవ్స్‌లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కరణ్ జోహార్ చాట్ షోపై కూడా ఇలియానా సెబాస్టియన్‌ల మధ్య బంధం ఉందని ఆ షో డైరెక్టర్ పరోక్షంగా కన్ఫామ్ చేశాడు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications