ఏపీపై అల్పపీడన ప్రభావం..

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్‌ పరిసరాల్లో ఇది ఉంది. ఈ ప్రభావంతో కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రాబోయే 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, సీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఉత్తరకోస్తా, 1వ తేదీ నుంచి కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో వానలు పెరగనున్నాయని అంచనా వేస్తోంది.

ఈనెల 18న ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని.. అది అల్పపీడనంగా మారేందుకు అవకాశాలున్నాయని వాతావరణశాఖ చెప్పింది. ఉత్తర, దక్షిణ కోస్తాల్లో కొన్నిచోట్ల, రాయలసీమలో సోమవారం అక్కడక్కడా వానలు కురుస్తాయంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లో జల్లులు పడతాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సంస్థ వెల్లడించింది.

imd rain alert to andhra pradesh

జులై 18వ తేదీ నుంచి 20వ తేదీవరకు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జులై 16 నుంచి 20వ తేదీ వరకు కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని, 17 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని, జులై 16 నుంచి 17 వరకు రాష్ట్రంలోలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. తెలంగాణపై ఆవర్తనం ప్రభావం కనిపిస్తోందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+