వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలపై ఆగిన రైలు ఇంజిన్.. పలు రైళ్ల రాకపోకలక అంతరాయం

|
Google Oneindia TeluguNews

విశాఖపట్టణం : విశాఖలో ఎలక్ట్రికల్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. దీంతో మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. మిగిలిన రెండు ట్రాక్‌లపై రైళ్ల రాకపోకలను కొనసాగిస్తున్నారు. దీంతో దాదాపు మూడు గంటలపాటు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

శనివారం ఉదయం 8 గంటలకే రైలింజన్ పట్టాలు తప్పింది. ప్రధాన మార్గంలో రైలు ఆగిపోవడంతో .. వెంటనే అధికారులు స్పందించారు. మిగిలిన రెండు ట్రాక్‌ల గుండా రైళ్లను పంపిస్తున్నారు. తర్వాత ఇంజిన్‌ను ఉదయం 11 గంటల సమయంలో పట్టాలు ఎక్కించేందుకు చర్యలు చేపట్టారు. మిగిలిన ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. కానీ షెడ్యూల్ కన్నా మూడుగంటల ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్టణానికి వచ్చే మూడు రైలు మార్గాల్లో ఒకదానిపై ఇంజిన్ పట్టాలు తప్పింది. వెంటనే మరమ్మతు చేపట్టారు అధికారులు. అయితే సూపర్ ఫాస్ట్ రైళ్లు సహా ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు కొన్ని రైళ్లను సమీప స్టేషన్లలో నిలిపివేశారు.

in vizag train engine derail

రద్దీగా ఉండే విశాఖ మార్గంలో రైలింజన్ పట్టాలు తప్పడంతో .. మిగతా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. నిర్ధారిత షెడ్యూల్ కన్నా మూడు గంటల పాటు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు సుదూర ప్రాంత ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.

English summary
In Vishakha the electrical train engine derails. This has disrupted the arrival of other trains. Train traffic continues on the other two tracks. The trains were running late for about three hours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X