• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీడీపీలో అంతర్గత పోరు .. డొక్కా వర్సెస్ గల్లా .. బాబుకు అన్నీ కష్టాలే

|

ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన టీడీపీ అసలే ఇబ్బందుల్లో ఉంటే మరోపక్క పార్టీలో అంతర్గత కలహాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. నీవల్ల అంటే నీ వల్లే ఓటమి పాలయ్యామని నేతలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పిస్తున్నారు . నేతల మధ్య వర్గపోరు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది . ఓటమిపై నేతలు పరస్పరం దూషించుకుంటూ దుమ్మెత్తిపోసుకుంటున్న తీరు టీడీపీ పరిస్థితిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది.

పవన్ , బీజేపీ నేత రామ్ మాధవ్ ల రహస్య భేటీ .. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్

  జగన్ గారు మీ గులాం గిరికి సలాం - లోకేష్
  అసలే ఓటమితో ఇబ్బందుల్లో ఉన్న టీడీపీలో నేతల మధ్య అంతర్గత పోరు

  అసలే ఓటమితో ఇబ్బందుల్లో ఉన్న టీడీపీలో నేతల మధ్య అంతర్గత పోరు

  గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో నేతల మధ్య అంతర్గత కలహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి . మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ కు - గల్లా కుటుంబం మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. తన ఓటమికి గల్లా అరుణకుమారే కారణమని డొక్కా మండిపడుతున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా విషయాన్ని ఆయన తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇక డొక్కా తీరుపై గల్లా అరుణ కుమారి కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు . ఎవరికీ చెప్పలేక చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు.

  గల్లా అరుణ కుమారి వల్లే తానూ ఓడిపోయానంటున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్

  గల్లా అరుణ కుమారి వల్లే తానూ ఓడిపోయానంటున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్

  అసలు డొక్కా మాణిక్య వరప్రసాద్ కు గల్లా అరుణ కుమారికి మధ్య ఘర్షణ విషయానికి వస్తే డొక్కా ఓటమికి గల్లానే కారణం అని వారి మధ్య ఘర్షణ జరుగుతుంది. మొన్నటి ఎన్నికల్లో డొక్కా తాడికొండ సీటును కోరుకున్నారట. కానీ.. అనేక పరిణామాల మధ్య ఆయనకు చంద్రబాబు ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని కేటాయించారు. తాడికొండలో డొక్కా గతంలో రెండుసార్లు గెలవడంతో పాటు మంత్రిగా కూడా పనిచేశారు. ఈ క్రమంలోనే ఆయన తాడికొండ నుంచే పోటీ చేస్తానని చెప్పిన బాబు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కే సీటు ఇచ్చారు. దీంతో డొక్కా అయిష్టంగానే తనకు పట్టులేని ప్రత్తిపాడులో పోటీ చేసి ప్రస్తుత హోం మంత్రి సుచరిత చేతిలో ఓడిపోయారు.

  ప్రత్తిపాడు నియోజవర్గం టీడీపీలో వర్గ పోరు

  ప్రత్తిపాడు నియోజవర్గం టీడీపీలో వర్గ పోరు

  అయితే ప్రత్తిపాడు నియోజవర్గం టీడీపీలో అప్పటివరకు మూడు నాలుగు వర్గాలు ఉండేవి. మాజీమంత్రి రావెల - కందుకూరు వీరయ్య - మాకినేని పెదరత్తయ్య - ఎంపీ గల్లా వర్గాలతో పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉందేదని డొక్కా అనుచరులు చెబుతున్నారు . డొక్కా వచ్చిన తర్వాతనే పార్టీ శ్రేణులందరూ ఒక్క తాటి పైకి వచ్చారని - నియోజకవర్గంలో పార్టీ బలం పెరిగిందని అంటుంటారు. తనకు ఇష్టం లేని నియోజకవర్గాన్ని కేటాయించినా తాను నిబద్ధతతో పనిచేశానని - అందరికీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చానని అంటుంటారు డొక్కా.ఈ ఎన్నికల్లో తన ఓటమికి గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణకుమారినే కారణమని డొక్కా ఆరోపిస్తున్నారు.

  తన ఓటమికి కుట్ర చేసింది గల్లా అరుణ కుమారినే అన్న డొక్కా

  తన ఓటమికి కుట్ర చేసింది గల్లా అరుణ కుమారినే అన్న డొక్కా

  ఎమ్మెల్యే ఓటు ఎవరికైనా వేసుకోండి.. కానీ.. ఎంపీకి మాత్రం టీడీపీకే వేయండి.. అంటూ అరుణకుమారి ప్రచారం చేశారని డొక్కా మండిపడుతున్నారు. తనను ఓడించేందుకే.. కుట్రపూరితంగానే గల్లా ఇలాంటి ప్రచారం చేశారని డొక్కా ఆగ్రహంతో ఊగిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లారు. అయితే.. చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. డొక్కా మరింత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. గల్లా అరుణకుమారి కూడా పరిస్థితిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే.. పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రత్తిపాడులోనే ఉండడంతో ఈ ఇద్దరు నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు.. చంద్రబాబుకు మరింత ఇబ్బందిగా మారిందట. ఇప్పుడు అసలే కష్టాల్లో ఉన్న టీడీపీ లో నేతల పోరు చంద్రబాబుకు సంకటంగా మారింది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The TDP, which lost the election, is in real trouble, the internal strife on the other side is getting worse day by day. The leaders have been accusing each other of being a loser. Chandrababu has become a headache among the leaders. When it comes to the Dokka Manikya Varaprasad clash between Galla Aruna Kumari, Dokka said Galla is the cause of his defeat. Arunakumari was campaigned to vote only to mp candidate galla jayadev. Dokka seems to be furious that Galla has made such a propaganda only to defeat him. It has become a headache for Chandrababu
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more