గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా, మోడీ ట్వీట్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను కేంద్రఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. ఇందులో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పించారు.

Gannavaram airport

అలాగే, ఏడో వేతన సంఘం సిఫార్సుల్లో సవరణలను మంత్రివర్గం ఆమోదించింది. జాతీయ ఉక్కు విధానానికి కూడా ఆమోదం తెలిపింది.

ప్రధాని మోడీ ట్వీట్

గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో ఏపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధికి ఈ అంతర్జాతీయ హోదా ఉపకరిస్తుందని అభిలాషించారు.

మూడేళ్లలోనే..

గన్నవరం విమానాశ్రయం కేవలం మూడేళ్లలోనే ఎంతో అభివృద్ధి సాధించింది. అతి తక్కువ సమయంలో అంతర్జాతీయ హోదా దక్కింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
International status for Gannavaram airport.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి