ISRO.. నింగిలోకి దూసుకెళ్లిన అత్యాధునిక శాటిలైట్

తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో మరో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మరో అత్యాధునిక ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది. ఈ ఉదయం సరిగ్గా 10:42 నిమిషాలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి దూసుకెళ్లింది ఈ రాకెట్. జియో సింక్రనైజ్డ్ లాంచింగ్ వెహికల్- ఎఫ్12, ఎన్‌వీఎస్-1ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

అత్యాధునిక నేవిగేషన్ శాటిలైట్‌ను మోసుకెళ్లింది జీఎస్‌ఎల్వీ. నేవిషన్ విత్ ఇండియన్ కాన్స్టల్లేషన్ (నేవిక్) సర్వీసులను మెరుగుపర్చడానికి ఇస్రో చేపట్టిన ప్రయోగం ఇది. నేవిక్ శాటిలైట్ తరహా ప్రాజెక్ట్‌ను చేపట్టడం ఇస్రోకు ఇదే తొలిసారి. గ్లోబల్ పొజీషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) తరహాలోనే ఇదీ పని చేస్తుంది. నేవిక్ శాటిలైట్- భూగోళ, వైమానిక, సముద్ర రవాణా, లొకేషన్-ఆధారిత సేవలు, పర్సనల్ మొబిలిటీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తుంది.

ISRO successfully launches its advanced navigation satellite GSLV-F12 Sriharikota

వనరుల పర్యవేక్షణ, సర్వేయింగ్, జియోడెసీ, శాస్త్రీయ పరిశోధన, సింక్రనైజేషన్, భద్రత-ఆఫ్-లైఫ్ అలర్ట్ వంటి చోట్ల నేవిక్ సేవలను ఇస్రో ఉపయోగించుకుంటుంది. ఈ రాకెట్- అత్యాధునికమైన రుబీడియం ఆటమిక్ క్లాక్‌ను పేలోడ్‌గా తీసుకెళ్లింది. గుజరాత్ అహ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్‌లో ఈ క్లాక్‌ను అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ఈ తరహా రుబీడియం ఆటమిక్ క్లాక్ కలిగివున్న దేశాలు చాలా తక్కువ.

భారత్ సహా ఈ రీజియన్, భారత సరిహద్దులకు అవతల 1,500 కిలో మీటర్ల మేర సిగ్నల్స్‌ను గ్రహించగలదు ఈ రుబీడియం ఆటమిక్ క్లాక్ నెట్‌వర్క్. లొకేషన్‌ ఖచ్చితత్వాన్ని 20 మీటర్ల కంటే మరింత మెరుగ్గా చూపించగలుగుతుంది. 50 నానో సెకన్ల కంటే మెరుగైన సమయాన్ని అందిస్తుంది. నేవిక్ వ్యవస్థ ఎల్5 బ్యాండ్ విడ్త్‌‌తో సేవలను అందిస్తుందని ఇస్రో తెలిపింది.

ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. ప్రయోగించిన 18 నిమిషాల తరువాత ఈ అంతరిక్ష వాహకనౌక- నేవిక్ శాటిలైట్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు చెప్పారు. దీనితో ఈ మిషన్ విజయవంతమైందని అన్నారు. ఉపగ్రహాన్ని ఖచ్చితమైన కక్ష్యలో ప్రవేశపెట్టగలిగామని, ఈ క్రమంలో క్రయోజెనిక్ సిస్టమ్‌లో స్వల్ప సమస్య ఏర్పడినప్పటికీ.. దాన్ని తొలగించగలిగామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+