Proba3 : ఇస్రో ఖాతాలో మరో సక్సెస్-యూరోపియన్ శాటిలైట్స్ మోసుకెళ్లిన పీఎస్ఎల్వీ..!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. ఇవాళ ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం (షార్) నుంచి పీఎస్వీఎల్వీ సీ59 వాహన నౌక మూడు యూరోపియన్ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. వాస్తవానికి నిన్న జరగాల్సిన ఈ ప్రయోగం పలు కారణాలతో ఇవాళ్టికి వాయిదా పడింది. అయితే ఇవాళ ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి.

ISRO successfully launches PSLV rocket with European Sun Observation Satellites Proba-3

సంపూర్ణ సూర్యగ్రహణాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన మూడు ప్రత్యేక ఉప గ్రహాలను మోసుకుంటూ పీఎస్వీఎల్వీ నౌక ఇవాళ నింగికెగసింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అప్పగించిన ఈ బాధ్యతను ఇస్రో విజయవంతంగా నెరవేర్చింది. ప్రోబా 3గా పేర్కొంటున్న ఓ ప్రత్యేక స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఈ మూడు ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐఎల్) ఆధ్వర్యంలో ప్రత్యేక వాణిజ్య మిషన్‌లో భాగంగా ప్రోబా-3 అంతరిక్ష నౌకను అత్యంత దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంచుతుందని ఇస్రో చెబుతోంది.

ప్రోబా-3 అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కక్షలో తిప్పే మిషన్ . ఇది అధునాతన ఫార్మేషన్-ఫ్లైయింగ్ టెక్నాలజీ సాయంతో పనిచేస్తుంది. ఇందులో రెండు అంతరిక్ష నౌకలు ఉంటాయి. అవి కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్, ఓకల్టర్ స్పేస్‌క్రాఫ్ట్. ఈ రెండూ ఎంపిక చేసిన కక్షలోకి చేరిన తర్వాత ఎంపిక చేసిన కాన్ఫిగరేషన్ లో పని మొదలుపెడతాయి. వీటిని ఐరోపా అంతరిక్ష సంస్ద నియంత్రిస్తుంది. ఏకంగా 545 కిలోల బరువున్న ఈ రెండు ఉపగ్రహాలను 44.5 మీటర్ల పొడవైన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఇది ఎగిరే సమయంలో 320 టన్నుల బరువు ఉంటుంది. ప్రయోగించిన దాదాపు 18 నిమిషాల తర్వాత భూమికి 600 కి.మీ ఎత్తులో ఉపగ్రహాల్ని ఉంచుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+