జగన్ ప్రజలను మోసం చేస్తున్నాడు.. ఏపీలో స్వరం పెంచుతున్న బీజేపీ..!!
గుంటూరు : దక్షిణాదిలో తమ పార్టీని క్రమంగా విస్తరించుకోవాలనుంటున్న బీజేపీ .. ఆ దిశగా అడుగులేస్తోంది. ప్రాంతీయ పార్టీలతో మంచిగా ఉంటూనే తమ పార్టీ విస్తరణపై ఫోకస్ చేస్తోంది. తెలంగాణలో బీజేపీకి ఓ ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు ఉన్నారు. ఏపీలో మాత్రం అందుకు విరుద్ధ పరిస్థితి. ఈ క్రమంలో అధికార వైసీపీ టార్గెట్‌గా బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. సీఎం జన్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

సాధ్యం కాదు కదా ..
ఏపీ సహా మిగతా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం ఇదివరకే స్పష్టంచేసింది. లోక్ సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీకి ప్రత్యేక హదా కోసం పోరాడుతామని జగన్ వ్యాఖ్యానించడాన్ని బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి తప్పుపట్టారు. హోదా సాధ్యం కాదని కేంద్రం చెప్పినా .. పదే పదే అదే విషయం వల్లించడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఒక విషయ పదే పదే చెప్పినా అమలు కాదని తేల్చిచెప్పారు. దీంతో బీజేపీని దోషిగా నిలబెట్టాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు పురందేశ్వరి.
అభ్యర్థుల పాట్లు ..
ఏపీ సర్కార్ తీసుకొచ్చిన పలు పథకాలను లోపభూయిష్టంగా ఉన్నాయని విమర్శించారు. గ్రామ సచివాలయ విధానంతో అనేకమంది ఇబ్బందులు పడుతున్నారని గుర్తుచేశారు. ఇదీ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రేషన్ డీలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలకు భద్రత ఇవ్వరా అని నిలదీశారు. వారి భవిష్యత్‌తో ఆడుకోవడం ఏంటని మండిపడ్డారు. ఇసుక, మట్టి విధానంపై ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇసుకపై నిషేధం విధించడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..!












Click it and Unblock the Notifications