Jagan మార్క్ నియామకాలు : నామినేటెడ్ పదవులు రిలీజ్ : లెక్క- పక్కా..ఎవరికి ఏ పదవి...!!
వైసీపీ నేతలు రెండేళ్లకు పైగా నిరీక్షిస్తున్న నామినేటెడ్ పదవులను ఎట్టకేలకు పార్టీ అధినాయకత్వం విడుదల చేసింది. ముఖ్యమంత్రి జగన్ మార్క్ ఎంపిక కనిపించింది. పార్టీ కోసం పని చేస్తున్న వారిని గుర్తించి ..పార్టీ సమన్వయకర్తలు ఎంపిక చేసిన జాబితాకు జగన్ తుది మెరుగులు దిద్దారు. అందులో భాగంగా..అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమలు చేస్తున్న 60 శాతం ఎస్సీ-ఎస్టీ-బీసీ-మైనార్టీ లకు ఈ నామినేటెడ్ పోస్టుల్లోనూ అమలు చేసారు.
లెక్క ఎక్కడా తప్పకుండా పక్కగా జిల్లా యూనిట్ గా..రాష్ట్ర స్థాయిలో పదవుల్లోనూ ఇదే సమీకరణంతో ఎంపిక చేసారు. ఇక, మహిళలకు సైతం 50 శాతం పదవులు కేటాయించారు. రాష్ట్ర స్థాయి పదవులతో పాటుగా డైరెక్టర్లను ఖరారు చేసారు. ఈ నెల 8వ తేదీన వైఎస్సార్ జన్మదినం నాడే ఈ జాబితా విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ...ఎంపిక ప్రక్రియ ఆలస్యం కావటంతో ఈ రోజు తుది రూపు ఇచ్చారు. ఇక, ఏ పదవులు ..ఎవరికి దక్కాయంటే...జాబితా ఇలా ఉంది

నామినేటెడ్ పదవుల్లో భాగంగా..ఎమ్మెల్యేలకు ఉన్న అదనపు పదవులను రద్దు చేస్తూ సీఎం జగన్ నిర్ణయించారు. జోడు పదవుల విధానానికి బ్రేక్ వేసారు. 135 పోస్టుల ప్రకటన అందులో మహిళలకు 67 , పురుషలకు 68 పోస్టులు కేటాయించారు. ఎస్సీ-ఎస్టీ-బీసీ- మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. మహిళలకు 50.03 శాతం పదువులు ఖరారు చేసారు. రానున్న మూడేళ్ల కాలంలో పార్టీ- ప్రభుత్వ పరంగా ప్రజలకు సేవలు అందించేందుకు టీంను సిద్దం చేసినట్లుగా పార్టీ ప్రకటించింది.
76 పదవులు ఎస్సి, ఎస్టీ ,బీసీ మైనార్టీ లకు 57 పదవులు ఓసీలకు కేటాయించారు.
శ్రీకాకుళం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు,
విజయనగరం జిల్లా: 7 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
విశాఖ జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
తూర్పు గోదావరి: 17 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 9 పోస్టులు
పశ్చిమగోదావరి: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
కృష్ణా జిల్లా : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
గుంటూరు జిల్లా : 9 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
ప్రకాశం జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
నెల్లూరు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
చిత్తూరు జిల్లా: 12 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 7 పోస్టులు
అనంతపురం : 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
వైఎస్సార్ జిల్లా: 11 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 6 పోస్టులు
కర్నూలు జిల్లా: 10 పోస్టుల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీలకు 5 పోస్టులు
స్టేట్ ఛైర్మెన్లు వీరే..
సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌గా అక్కరమాని విజయనిర్మల
గ్రంథాలయ ఛైర్ పర్సన్‌గా రెడ్డి పద్మావతి
హితకారిణి సమాజం ఛైర్మన్‌గా కాశీ మునికుమారి
కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా అడపా శేషు
రాష్ట్ర మైనార్టీ విభాగం చైర్మన్‌గా జాన్ వెస్లీ
బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా సుధాకర్
ఏపీఐఐసీ ఛైర్మన్ గా మెట్టు సుధాకర్ రెడ్డి
కమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా శ్రీ తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి) .
ఏపీ క్షత్రిక కార్పోరేషన్ ఛైర్మన్ గా పాతపాటి సర్రాజు












Click it and Unblock the Notifications