Bheemla Naik కు చుక్కలు చూపిస్తున్న జగన్ -థియేటర్లపై ఆంక్షలు-జీవో ఆలస్యం చేసి మరీ..
ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన పోరు జగన్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గా మారిపోయి చాలా కాలమే అయింది. వకీల్ సాబ్ చిత్రం విడుదల సమయంలో టికెట్ల ధరలు, అదనపు షోలపై ఆంక్షలు విధించడం ద్వారా పవన్ ను టార్గెట్ చేసిన వైసీపీ సర్కార్ కు హైకోర్టు ఆదేశాలతో జనసేనాని చెక్ పెట్టగలిగారు. దీంతో ఏకంగా టాలీవుడ్ నే టార్గెట్ చేయడం మొదలుపెట్టిన జగన్.. సినిమా టికెట్ల ధరల్ని, షోల వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ పెద్దల విజ్ఢప్తితో వెనక్కి తగ్గినా పవన్ చిత్రం భీమ్లా నాయక్ విడుదల దృష్ట్యా వెసులుబాటు ఇచ్చే జీవో ఇవ్వకుండా ఆపడమే కాకుండా థియేటర్లను కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు.
Recommended Video

భీమ్లా నాయక్ కష్టాలు
ఏపీలో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదలవుతున్నా ఆంక్షలు మాత్రం తప్పడం లేదు. ముఖ్యంగా ఫ్యాన్స్ కోసం థియేటర్లలో వేసే బెనిఫిట్ షోలు వద్దని, అదనపు షోలు వెయొద్దని ఇప్పటికే అధికారులు థియేటర్లకు హెచ్చరికలు చేస్తున్నారు. అలాగే టికెట్ల ధరలు సైతం జీవో నంబర్ 35 ప్రకారమే అమలు చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. దీంతో భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శన కోసం తీసుకున్న థియేటర్ల యాజమాన్యాలు బెంబేలెత్తుతున్నాయి. రేపు భిమ్లా నాయక్ సినిమా విడుదలకు ఆటంకాలు లేకపోయినా థియేటర్లపై ఆంక్షలతో నిర్మాతలకు ఇబ్బందులు తప్పేలా లేవు.

రద్దైన జీవో అమలుకు థియేటర్లపై ఒత్తిడి
గతంలో వకీల్ సాబ్ సినిమా విడుదల సందర్భంగా అదనపు రేట్లతో టికెట్లు అమ్ముకోవడానికి వీల్లేకుండా ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 35ను తీసుకొచ్చింది. దీన్ని హైకోర్టు కూడా తప్పుబట్టింది. ఆ తర్వాత ప్రభుత్వం కూడా దాన్ని వెనక్కి తీసుకుంది. అయితే రద్దు చేసిన ఈ జీవో స్ధానంలో కొత్తగా మరో జీవో రాకుండానే ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా టికెట్లను ఆ పాత జీవో ప్రకారమే అమ్మాలంటూ అధికారులు పలు చోట్ల థియేటర్లను ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అధికారుల తీరుపై థియేటర్ల యాజమాన్యాలు మండిపడుతున్నాయి.

భీమ్లా నాయక్ కోసమే కొత్త జీవో ఆలస్యం ?
ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు గతంలో నియమించిన కమిటీ ఇప్పటికే మూడుసార్లు భేటీ అయింది. ఆ మధ్యలో టాలీవుడ్ పెద్దలు పలుమార్లు సీఎం జగన్, మంత్రి పేర్నినానితో భేటీ అయి చర్చలు జరిపారు. దీంతో సినిమా టికెట్ల వివాదం సద్దుమణిగింది. ముఖ్యంగా జగన్ తో చర్చల తర్వాత వారం రోజుల్లో కొత్త జీవో వస్తుందని సినీ పెద్దలంతా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటివరకూ ఆ కొత్త జీవో మాత్రం రాలేదు. అదే సమయంలో భీమ్లా నాయక్ సినిమా విడుదల అవుతోంది. దీంతో ఆ కొత్త జీవోలో ఇచ్చే వెసులుబాట్లు ఈ సినిమాకు వర్తించకుండా పోయాయి. ఈ సినిమా విడుదలయ్యాకే జీవో ఇద్దామనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ఫిలిం ఛాంబర్ ఆగ్రహం
ఏపీలో భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్భంగా ధియేటర్లపై ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసింది. రద్దు చేసిన జీవో 35 ఆధారంగా అధికారులు థియేటర్లపై ఆంక్షలు ఎలా విధిస్తారని ఫిలిం ఛాంబర్ ఇవాళ జగన్ సర్కార్ ను ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించింది. జీవో 35 కంటే ముందున్న జీవో 100 ప్రకారమే టికెట్లు అమ్ముకోనివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. నటీ నటులకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉన్నా అంతిమంగా సినిమాల వద్దకు వచ్చేటప్పటికి సినిమాయే ప్రాధాన్యత అని ఫిలిం ఛాంబర్ క్లారిటీ ఇచ్చింది.

మళ్లీ జగన్ వర్సెస్ పవన్ పోరు ?
నిన్న మొన్నటివరకూ టాలీవుడ్ సినీ టికెట్ల ధరల విషయంలో మెతక వైఖరితో ఉన్నట్లు కనిపించిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విషయంలో మాత్రం పాత ఆదేశాలను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. రేపు సినిమా విడుదల చేసే థియేటర్లను టార్గెట్ చేస్తూ జరిమానాలు విధించేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. అలాగే నిబంధనల ఉల్లంఘన జరిగితే థియేటర్ల జప్తు కూడా చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో వకీల్ సాబ్ సినిమా సమయంలో జరిగినట్లుగానే భీమ్లా నాయక్ సినిమాకు కూడా జగన్ వర్సెస్ పోరు తప్పేలా లేదు. దీంతో ఇప్పుడు పవన్ ఏం చేయబోతున్నారనే అంశం ఆసక్తి రేపుతోంది.
-
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications