చిరంజీవి మ‌ద్ద‌తు జ‌గ‌న్‌కా? జ‌న‌సేన‌కా? జ‌న‌సైనికుల డిమాండ్‌!!

మెగాస్టార్ చిరంజీవి అభిమానులే ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులుగా, రామ్ చ‌ర‌ణ్ అభిమానులుగా, అల్లు అర్జున్ అభిమానులుగా ఉన్నారు. అంతా ఒకే కుటుంబం కాబ‌ట్టి అంద‌రి అభిమానులు ఒక‌టే. అయితే సినిమాలు వేరు.. రాజ‌కీయం వేరు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై చిరు త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పోరాడుతున్నారు. ఈసారి జ‌గ‌న్ అధికారంలోకి రానీయ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌నిచ్చేది లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

 జ‌న‌సేన సైనికుల‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా కేసులు

జ‌న‌సేన సైనికుల‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా కేసులు

రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌పై ప్ర‌భుత్వం కేసులు న‌మోదు చేస్తోంది. వీటిపై కోర్టులో పోరాడ‌టానికి పార్టీ త‌ర‌ఫున ఒక వ్య‌వస్థ‌ను ఏర్పాటు చేసుకునే ప‌నిలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఉన్నారు. ప‌వ‌న్ సినిమాల‌ను దెబ్బ‌తీసేందుకే సినిమా టికెట్ల త‌గ్గింపు అని, చిత్ర పరిశ్ర‌మ‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ జ‌న‌సైనికులు మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. దీనిపై సినీపెద్ద‌లు ముఖ్య‌మంత్రిని కల‌వ‌డం, ధ‌ర‌లు పెంచుకోవ‌డానికి అనుమ‌తులు రావ‌డం జ‌రిగిపోయాయి. చిరంజీవికి, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయంటూ ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఎప్ప‌టినుంచో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వాటిల్లో వాస్త‌వ‌మెంతో తెలియ‌దుకానీ ఇటీవ‌ల చిరంజీవి ప‌లుమార్లు త‌న సినిమాల‌కు టికెట్ ధ‌ర‌ల‌ను పెంచుకోవ‌డానికి జ‌గ‌న్‌ను క‌లిశారు. ఆయ‌న అనుమ‌తి మంజూరు చేశారు.

 జ‌గ‌న్‌పై దూకుడు పెంచిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

జ‌గ‌న్‌పై దూకుడు పెంచిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

తాజాగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌గ‌న్‌పై త‌న దూకుడును మ‌రింత పెంచారు. వారం రోజుల క్రితం విజ‌య‌వాడ‌లో రాష్ట్రం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చిన మెగా అభిమానులంతా స‌మావేశ‌మ‌య్యారు. జ‌న‌సేన‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని నిర్ణ‌యించారు. చిరంజీవికి, జ‌గ‌న్‌కు స‌త్సంబంధాలున్నాయి. వ్యాపార బంధాలున్నాయ‌నే ప్ర‌చారం ఉండ‌నే ఉంది. మ‌రోవైపు త‌మ్ముడు ప‌వ‌న్ ఏపీ ప్ర‌భుత్వంపై ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇరుపార్టీల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఇటువంటి స‌మ‌యంలో చిరంజీవి అభిమానులంతా స‌మావేశ‌మ‌వ‌డం ఒక‌ర‌కంగా చిరంజీవికి ఇబ్బందిక‌ర‌మేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 చిరంజీవికి తెలియ‌కుండా స‌మావేశం జ‌ర‌గ‌దు?

చిరంజీవికి తెలియ‌కుండా స‌మావేశం జ‌ర‌గ‌దు?


చిరంజీవికి స‌మాచారం లేకుండా, ఆయ‌న అనుమ‌తి లేకుండా విజ‌య‌వాడ‌లో అభిమానుల స‌మావేశం జ‌ర‌గ‌ద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలంటున్నాయి. సొంత త‌మ్ముడు కాబ‌ట్టి ప‌వ‌న్‌కే చిరు మ‌ద్ద‌తిస్తార‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌భుత్వ‌ప‌రంగా ఉండే ఇబ్బందుల‌ను ఎదుర్కోవాలంటే జ‌గ‌న్‌తో స‌ఖ్య‌త‌గా ఉండ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా చిరంజీవి ప‌రిస్థితి త‌యారైంద‌ని, క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం, విడ‌వ‌మంటే పాముకు కోపం అన్న‌ట్లుగా ఉంద‌ని, ఈ త‌ర‌హా ధోర‌ణిని విడ‌నాడి ఒక స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యానికి రావాల‌ని అభిమానులు, జ‌న‌సేన సైనికులు చిరంజీవిని డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+