జగన్ ప్రతిపాదనకు ఓకే చెప్పిన విజయమ్మ?
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో సంచలన అడుగు వేయడానికి నిర్ణయం తీసుకున్నారా? వైయస్ జగన్ లోక్సభకు పోటీ చేస్తారని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ పులివెందుల నుండి విజయమ్మను బరిలోకి దించడానికి జగన్ రంగం సిద్ధం చేస్తున్నారా? అంటే ఏపీలోని కొన్ని వర్గాలు అవును అని చెబుతున్నాయి.
జగన్ తాజా ఆలోచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో టిడిపి కూటమి చేతిలో ఘోర ఓటమి పాలైన వైసీపీని రాజకీయంగా ముందుకు నడిపించడానికి జగన్ కొత్త ఆలోచన చేస్తున్నట్టు ప్రస్తుతం ఏపీలో చర్చ జరుగుతుంది. ఏపీ ఎన్నికల ఫలితాలలో కనిష్ట స్థాయిలో 11 మంది సభ్యుల సంఖ్యా బలం ఉండడం, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోవడం వెరసి జగన్ తాజాగా కొత్త ఆలోచన చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది.

విజయమ్మపై జగన్ ఒత్తిడి?
కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి తో రాజీనామా చేయించి ఆ స్థానంలో జగన్ పోటీ చేయడంతో పాటు పులివెందుల నియోజకవర్గం నుంచి విజయమ్మని ఎన్నికల బరిలోకి దించాలని జగన్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.ఇటీవల పులివెందుల వెళ్లిన జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో విజయమ్మపై ఒత్తిడి తీసుకు వచ్చినట్టు పార్టీ శ్రేణులలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
విజయమ్మ కన్నీళ్ళకు పెద్ద కారణమే
ఇక వైయస్సార్ జయంతి రోజున విజయమ్మ కొడుకు జగన్ ను పట్టుకొని ఆ స్థాయిలో కన్నీళ్లు పెట్టుకున్నట్టు వచ్చిన వార్తలు కూడా విజయమ్మ పై ఒత్తిడి కారణంగానే వచ్చినట్టు పలువురు చర్చిస్తున్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేని జగన్ లోక్సభ వేదికగా తన గళాన్ని వినిపించాలని భావిస్తున్నట్టు, అందుకు తల్లిపై ఒత్తిడి తెస్తున్నట్టు చర్చ జరుగుతుంది.
జగన్ పై షర్మిల నిప్పులు
ఇప్పటికే అన్నాచెల్లెళ్ల రాజకీయం మధ్య నలిగిపోతున్న విజయమ్మ జగన్ ఒకవేళ నిజంగానే కొత్త ప్రపోజల్ పెడితే ఒప్పుకుంటారా అన్నది కూడా ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఒకవైపు వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా జగన్ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ జగన్ ని ఓడించడమే ధ్యేయంగా గత ఎన్నికల్లో పనిచేసింది. ఇప్పుడు కూడా ఏ మాత్రం అవకాశం దొరికినా జగన్ ను వదిలిపెట్టేదే లేదు అన్నట్టు షర్మిల తీరు ఉంది.
జగన్ ప్రతిపాదనకు విజయమ్మ ఓకే చెప్తారా?
ఇక మరోవైపు షర్మిల పైన జగన్ కూడా ఆగ్రహంతోనే ఉన్నట్టుగా సమాచారం. ఏపీలో వైసిపి ఘోర ఓటమికి షర్మిల కూడా ఒక కారణమని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాల భోగట్టా.. ఇలాంటి సమయంలో పులివెందుల నుంచి విజయమ్మని బరిలోకి దించాలని జగన్ ప్రపోజల్ పెడితే షర్మిల ఊరుకుంటారా? విజయమ్మ కొడుకు జగన్ ఆలోచనకు మద్దతుగా నిలుస్తారా? కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉన్న వీళ్ళ పంచాయతీతో నలిగిపోతున్న విజయమ్మ జగన్ ప్రతిపాదనకు ఓకే చెప్తారా అన్నది ఆసక్తి కలిగిస్తున్న అంశం.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications