వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

APFRS : ఏపీలో ఫేషియల్ అటెండెన్స్-సర్కార్ కీలక ఆదేశం- సర్కులర్ జారీ..!

ఏపీలో సచివాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ముఖ ఆధారిత హాజరు నమోదు చేసేందుకు కొత్త యాప్ ఏపీఎఫ్ఆర్ఎస్ వాడాలని ప్రభుత్వం సర్కులర్ పంపింది.

|
Google Oneindia TeluguNews

ఏపీలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హాజరు నమోదుపై ఇవాళ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సర్కులర్ పంపింది. దీన్ని సచివాలయంతో పాటు అన్ని శాఖల్లోనూ అమలు చేయాలని ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల హాజరు నమోదు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ ఏపీఎఫ్ఆర్ఎస్ లో నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ సచివాలయంతో పాటు అన్ని శాఖల విభాగాధిపతులకు సర్కులర్ పంపింది. ఇందులో ప్రభుత్వం ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా ముఖ ఆధారిత హాజరు నమోదుకు ఇప్పటికే నిర్ణయంతీసుకుందని, కానీ ఉద్యోగుల్ని ఇందులో నమోదు చేయించే ప్రక్రియ నత్తనడక సాగుతోందని తెలిపింది. దీన్ని 100 శాతం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇందులో పేర్కొంది.

Jagan regime orders to enroll 100 percent employees in new facial recognition app APFRS

ఇందుకోసం ఉద్యోగులకు అవసరమైతే స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ఈ యాప్ లో వందశాతం నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని సర్కులర్ లో ప్రభుత్వం తెలిపింది. ఇకపై కేవలం ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారానే హాజరు నమోదు చేయబోతున్నట్లు వెల్లడించింది. కాబట్టి విభాగాధిపతులు, నోడల్ అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకుని వందశాతం ఉద్యోగుల్ని ఇందులో నమోదు చేయించాలని కోరింది. ఈ ప్రక్రియలో ఎట్టి పరిస్దితుల్లోనూ విఫలం అయితే వారినే బాధ్యుల్ని చేస్తామని తెలిపింది.

English summary
ap government on today issued circular for using facial recognition app APFRS to collect attendance in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X