కెసిఆర్‌పై జైరాం సంచలన వ్యాఖ్యలు, వంశంగా చూసినా

వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కేంద్రమంత్రి జైరాం రమేష్ కౌంటర్ ఇచ్చారు. సీమాంధ్ర నేతల చేతుల్లో కెసిఆరే కీలుబొమ్మ అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వంశంపరంగా చూసినా ఆయన అక్కడి వారే అన్నారు. నాడు టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కనుసున్నుల్లో పని చేశారని, తర్వాత కుటుంబ పాలన కోసం ఉద్యమించారని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లోను హంగ్ రాదన్నారు. కాంగ్రెసు పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మరో పది జిల్లాలను చేస్తామని జైరాం రమేష్ చెప్పారు.

Jairam Ramesh fires at KCR

కెసిఆర్ నుండి తెలంగాణ ప్రాంతం విముక్తం కావాలని చెప్పారు. ఆయన పెద్ద అబద్దాల కోరు అన్నారు. భూస్వామ్య వ్యవస్థ నిర్మూలనకే తెలంగాణ అన్నారు. వరంగల్ నుంచే ఫ్యూడల్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైందని ఆయన చెప్పారు. అందరికీ సామాజిక న్యాయం చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+