అత్యుత్సాహం మరి! కాళ్లపై పడ్డ అభిమాని..కిందపడ్డ పవన్ కల్యాణ్!

విజయనగరం: ఇన్నాళ్లూ వెండితెరపై కనిపించిన తమ ఆరాధ్య నటుడు కళ్ల ముందుకొచ్చే సరికి తట్టుకోలేకపోయాడా అభిమాని. తాను అమితంగా అభిమానించే హీరోను నేరుగా చూస్తానని ఊహించి ఉండడు. అలాంటిది అతి సమీపం నుంచి చూసే సరికి..ఉద్వేగానికి గురయ్యాడు. నేరుగా తన అభిమాన హీరో కాళ్లపై పడ్డాడు. ఊహించని ఘటన చోటు చేసుకోవడంతో.. అదుపు తప్పారాయన. దబ్బున కిందపడ్డారు. ఆ హీరో మరెవరో కాదు.. పవన్ కల్యాణ్. జనసేన పార్టీ అధినేత.

ఎన్నికల ప్రచారంలో భాగంగా- పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం ఆయన విజయనగరానికి వెళ్లారు. అక్కడి అయోధ్య మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సభకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. పవన్ కల్యాణ్ ఎలా ప్రసంగిస్తారో మనకు తెలుసుగా! కాస్త ఆవేశంతో ఊగిపోతూ ప్రసంగించసాగారు.

Jana Sena Party Chief Pawan Kalyan fell down on the Dias at Vizayanagaram

తన ప్రసంగాన్ని ఆరంభించిన క్షణాల వ్యవధిలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎలా వచ్చాడో తెలియదు గానీ.. ఓ అభిమాని వేదికపైకి వచ్చేశాడు. వేదిక మీద ఉన్న పవన్ కల్యాణ్ గానీ, ఆయన వెంట ఉన్న అభ్యర్థులు గానీ, భద్రతా సిబ్బంది గానీ ఆ అభిమానిని గుర్తించలేదు. వారందరి వెనుక వైపు నుంచి వేదికపైకి వచ్చిన ఆ అభిమాని.. హఠాత్తుగా తోసుకుంటూ ముందుకొచ్చాడు. అమాంతం పవన్ కల్యాణ్ కాళ్ల మీద పడిపోయాడు.

Jana Sena Party Chief Pawan Kalyan fell down on the Dias at Vizayanagaram

ఊహించిన ఘటన ఎదురు కావడంతో కొద్దిక్షణాల పాటు అక్కడేం జరుగుతోందనేది ఎవరికీ అర్థం కాలేదు. తెలుసుకునే లోపే- పవన్ కల్యాణ్ అదుపు తప్పారు. నిల్చున్న వ్యక్తి నిల్చున్నట్లే వేదికపైనే కిందపడిపోయారు. కింద పడే సమయంలో ఆసరా కోసం ఆయన మైక్ అమర్చిన స్టాండ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించారు గానీ, విఫలం అయ్యారు. కింద పడ్డారు. దీని దెబ్బకు మైక్ స్టాండ్ కూడా విరిగిపోయింది. ఆ వెంటనే తేరుకున్న అక్కడి నాయకులు, భద్రతా సిబ్బంది.. ఆ అభిమానిని పట్టుకుని వేదిక మీది నుంచి కిందికి తీసుకెళ్లారు. కింద పడ్డ వెంటనే లేచి నిల్చున్న పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+