Ravan: రావణ్ పై దాడికి మళ్లీ జనసేన యత్నం..! బందరు పీఎస్ గోడ దూకి..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Ravan)పై దాడికి జనసేన శ్రేణులు (Janasena) తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. హైదరాబాద్ లో ఉన్న రావణ్ ను తాజాగా పిఠాపురం పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తెచ్చాక అక్కడ జనసేన శ్రేణులు రచ్చ రచ్చ చేశాయి. వారి నుంచి రావణ్ ను రక్షించేందుకు పిఠాపురం పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అక్కడి నుంచి కాకినాడ సర్పవరం పీఎస్ వద్దా అదే పరిస్ధితి. ఇవాళ మచిలీపట్నం పీఎస్ వద్దా అదే సీన్ రిపీటైంది. దీంతో పోలీసులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

Mavigun vs Amaravati: జగన్ సవాల్ తెచ్చిన మార్పు..! టీడీపీ టోన్ మారుతోందా ?
Mavigun vs Amaravati: జగన్ సవాల్ తెచ్చిన మార్పు..! టీడీపీ టోన్ మారుతోందా ?

పిఠాపురం పోలీసులు అరెస్టు చేసిన రావణ్ కు స్థానిక కోర్టు రిమాండ్ ను తోసిపుచ్చడమే కాకుండా బెయిల్ కూడా మంజూరు చేసింది. దీంతో వెంటనే అదుపులోకి తీసుకున్న కాకినాడ పోలీసులు సర్పవరం పీఎస్ కు తరలించారు. ఆ తర్వాత అక్కడి కోర్టు కూడా రావణ్ కు బెయిల్ ఇచ్చింది. దీంతో ముచ్చటగా మూడోసారి మచిలీపట్నంలోని ఇనుగుదురు పోలీసులు రావణ్ ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇవాళ రావణ్ ను బందరు పోలీసులు కోర్టుకు తరలించే లోపు స్టేషన్ లో విచారిస్తున్నారు.

Janasena Cadre Tries Storming Machilipatnam PS to Attack Arrested YouTuber Ravan
Prasna Ravan: ప్రశ్న రావణ్ కు పిఠాపురం కోర్టు రిలీఫ్- అంతలోనే మరో ట్విస్ట్..!
Prasna Ravan: ప్రశ్న రావణ్ కు పిఠాపురం కోర్టు రిలీఫ్- అంతలోనే మరో ట్విస్ట్..!

ఈ నేపథ్యంలో రావణ్ పై దాడి చేసేందుకు సిద్దమైన జనసేన కార్యకర్తలు ఇనుగుదురు పీఎస్ ను ముట్టడించారు. తమను లోపలికి అనుమతించాలంటూ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. పోలీసులు అనుమతించకపోవడంతో ఓ దశలో జనసైనికులు స్టేషన్ గోడ దూకి లోపలికి దూసుకెళ్లారు. వారిని తిరిగి పోలీసులు పట్టుకుని బయటికి పంపారు. దీంతో ఇనుగుదురు పోలీసు స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు తలెత్తాయి. మరోవైపు కోర్టులు వరుసగా రావణ్ రిమాండ్ తిరస్కరిస్తూ బెయిల్ మంజూరు చేస్తున్నా పోలీసులు వరుసగా వేరే ప్రాంతాల్లో కేసులు నమోదు చేసి అరెస్టుకు ప్రయత్నిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. అయినా ప్రభుత్వ ఆదేశాలతో వారు ఏమీ చేయలేని పరిస్ధితి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+