జనసేన గెలిచే సీట్లు ఇవే, అక్కడే ట్విస్ట్ - చిరంజీవి షాక్..!!
ఏపీ ఎన్నికల్లో ఈ సారి జనసేన కీలకంగా మారింది. జగన్ ను ఓడించటమే లక్ష్యంగా టీడీపీతో పవన్ జత కట్టారు. కూటమిలో భాగంగా 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో మాత్రమే పోటీ చేసారు. పిఠాపురం నుంచి పవన్ పోటీలో ఉన్నారు. ఆయన గెలుపు ఖాయమైంది. మెజార్టీ పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే సమయంలో జనసేన ఎన్ని సిట్లలో గెలిచేదీ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పవన్ అభ్యర్దులు గెలిచే సీట్లు అంశం ఇప్పుడు చిరంజీవికి షాక్ గా మారుతోంది.
జనసేన గెలుపు పై
జనసేన 21 సీట్లకు అంగీకరించటం పైన పవన్ పైన రాజకీయంగా ఒత్తిడి కనిపించింది. పవన్ 2 ఎంపీ, 21 ఎమ్మెల్యే స్థానాల్లో అధిక సంఖ్యలో గెలిచి మంచి స్ట్రైకింగ్ రేట్ తో నిలవాలని సూచించారు. ఈ సారి ఎన్నికల్లో పవన్ అభ్యర్దనకు మద్దతు దారులు అంగీకరించారు. జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ తో సహా పవన్ నమ్ముకున్న వర్గాలు జనసేనకు మద్దతుగా నిలిచినట్లుగా ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. పవన్ పార్టీ రాయలసీమలో రెండు స్థానాల్లో ఉత్తరాంధ్ర - గోదావరి జిల్లాలతో పాటుగా క్రిష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కో స్థానంలో పోటీ చేసాయి.

జనసేనకు మద్దతు
జనసేన ఈ ఎన్నికల్లో 14 - 15 సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. పెందుర్తి, విశాఖ దక్షిణం, యలమంచిలి, అనకాపల్లి, నెల్లిమర్ల, పాలకొండ లో నాలుగు స్థానాల్లో గెలుపు ఖాయమని అంచనా వేసాయి. అదే విధంగా తూర్పు గోదావరిలో పిఠాపురం నుంచి పవన్ గెలుపు ఖాయమైంది. రాజానగరం, పి గన్నవరం, రాజోలు, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో రెండు సీట్లు ఖాయంగా గెలుస్తారని విశ్లేషించారు. ఇక..పశ్చిమ గోదావరిలో జనసేన ఎక్కువ సీట్లు గెలవనుందని చెప్పుకొచ్చారు. భీమవరం, తాడేపల్లిగూడెం, నిడుదవోలు, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాల్లో నాలుగు స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని అంచనాగా వెల్లడించారు. క్రిష్ణా జిల్లాలో అవనిగడ్డ, గుంటూరు జిల్లా తెనాలి సీట్లలోనూ జనసేనకు గెలుపు ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు.

మెగా క్యాంప్ హ్యాపీ
సీమలో జనసేన పోటీ చేసిన తిరుపతి, రైల్వే కోడూరు లో మాత్రం ఫలితం కౌంటింగ్ రోజున మాత్రమే స్పస్టత వస్తుందని పేర్కొన్నాయి. రెండు ఎంపీ స్థానాల్లో జనసేన గెలుపుకు ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఉమ్మడి ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా పోటీ చేయగా..18 స్థానాల్లో విజయం సాధించింది. ఇప్పుడు పవన్ పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసి 14-15 స్థానాల్లో గెలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. తమ్ముడి గెలుపుతో పాటుగా కూటమిలో కొందరి గెలుపుకు మద్దతు ప్రకటించిన చిరంజీవి తాజాగా వెల్లడవుతున్న జనసేన గెలుపు సీట్ల సంఖ్య పైన ఆరా తీసినట్లు సమాచారం. జనసేన గెలుపు అంచనాలపై చిరంజీవి హ్యాపీతో షాక్ అయినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది.
-
మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ : భగ్గుమన్న ఏపీ నెటిజెన్లు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!











Click it and Unblock the Notifications