వైజాగ్ లో జగన్ ప్రమాణస్వీకారమైతే నేనే పోస్టర్లు అంటిస్తా-జనసేన నేత సవాల్..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు సాగుతున్న వేళ రాజకీయ పార్టీల మధ్య ఫలితాలపై మాటల యుద్దం కూడా మొదలైంది. ఇప్పటికే వైసీపీ నేతలు తాము మరోసారి గెలువబోతున్నామని, సీఎం జగన్ జూన్ 9న వైజాగ్ లో ప్రమాణస్వీకారం చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అలాగే వైజాగ్ లో జగన్ ప్రమాణస్వీకారం కోసం వచ్చే జనంతో ఇప్పటికే హోటల్స్ బుకింగ్స్ అయిపోయాయని, బస్సు టికెట్లు కూడా బుక్ అయిపోయాయని కూడా ప్రచారం చేస్తున్నారు.
దీనిపై స్పందించిన తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ వైసీపీ నేతలకు ఓ సవాల్ విసిరారు. వైజాగ్ లో జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం నిజమైతే తన సవాల్ స్వీకరించాలని కోరారు. వైజాగ్ లో ప్రమాణస్వీకారం ఏర్పాట్లపై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని ఆయన తెలిపారు. అలా ప్రచారం చేస్తున్న వారికి ఆయన విసిరిన సవాల్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

జగన్మోహన్ రెడ్డి గనుక వైజాగ్ లో 9 వ తేదీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు ప్రమాణ స్వీకార ఆహ్వాన పోస్టర్లు స్వయాన నేనే అంటిస్తా!!😑
— JanaSena Samhitha (@JSPSamhitha) May 30, 2024
సవాల్ ని స్వీకరిస్తారా ???🤙🤙
వైసీపీకి ఓపెన్ చాలెంజ్ విసిరిన తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి @KiranRoyaljsp🔥🔥💥💥 pic.twitter.com/U3FEUBPknD
వందకు వందశాతం భారీ మెజార్టీతో, తుఫానుతో తాము గెలుస్తున్నామని, 140కి పైగా సీట్లు సాధించబోతున్నామని కిరణ్ రాయల్ తెలిపారు. పవన్ కోరుకున్నట్లుగా తాము గెలుస్తున్నామన్నారు. అక్కడ మోడీ, ఇక్కడ కూటమి సీఎం ప్రమాణస్వీకారం చేయడం ఖాయమన్నారు. తన సవాల్ ను స్వీకరిస్తారా అని వైసీపీని అడిగారు. జగన్ ప్రమాణస్వీకారం చేస్తే మాత్రం తాను రాజకీయాలు వదిలేసి ఆయన పోస్టర్లు అంటిస్తానన్నారు.












Click it and Unblock the Notifications