వినుత కోట కేసులో సూపర్ ట్విస్ట్

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఇన్ ఛార్జ్ వినుత కోట తెర మీదికి వచ్చారు. తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ స్థాయిలో చోటు చేసుకుంటోన్న రాజకీయాలు, భ్రమరాంబ శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయం పాలకమండలి ఛైర్మన్ పదవి అంశాలను ప్రస్తావించారు. తన అభ్యంతరాలను తెలియజేశారు. తన నిర్ణయాన్ని పవన్ కల్యాణ్ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

కారు డ్రైవర్ హత్య కేసులో వినుత కోటను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొద్దిరోజుల కిందటే బెయిల్ పై విడుదల అయ్యారు. బెయిల్ కండీషన్లకు అనుగుణంగా ప్రస్తుతం అక్కడే ఉంటోన్నారు. హత్యకు గురైన కారు డ్రైవర్ కు సంబంధించిన ఓ వీడియో వెలుగులోకి వచ్చిన మరుసటి రోజే కోట వినూత తాజాగా వీడియోను విడుదల చేయడం, అందులో పలు అంశాలను చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Janasena Leader Vinutha Kota release a video

జనసైనికులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఓటర్లు, రాష్ట్ర ప్రజలకు కొన్ని విషయాలను తెలియజేయడానికి, మనసు నిండా పుట్టెడు బాధతో ముందుకొచ్చానని వాపోయారు. చెయ్యని తప్పుకు జైలుకు వెళ్లినందుకు తమకు బాధగా లేదని, కారు డ్రైవర్ ను తామే చంపామని మీడియాలో ప్రచారం చేయడం కలచివేసిందని అన్నారు. అతని చావులో తమ ప్రమేయం లేదని కోర్టు భావించడం వల్లే అరెస్టయిన 19 రోజుల్లోనే బెయిల్ వచ్చిందని చెప్పారు.

విదేశాల్లో లక్షల రూపాయలు వచ్చే జీతాన్ని వదులుకుని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చామని, ప్రజల ప్రాణాలకు తీయడానికి కాదని కోట వినుత అన్నారు. ఈ హత్య కేసులో తమకు ఎంతమాత్రం సంబంధం లేదని, కోర్టులో నిరూపించుకుని క్లీన్ చిట్ తో బయటికి వస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కోర్టులో విచారణ కొనసాగుతున్నందున.. ఇంత కంటే ఎక్కువ మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు.

పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తోన్నామని, పూర్తిస్థాయిలో బెయిల్ లభించిన వెంటనే త్వరలో ఆయనను కలుస్తానని అన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తనను రాజకీయాలకు దూరం చేయాలని, క్యారెక్టర్ దెబ్బ తీసే ప్రయత్నాలు జరిగాయని సాక్ష్యాధారాలతో సహా తనపై జరిగిన కుట్రను బయటపెడతానని అన్నారు. మీడియా సమక్షంలో వాటన్నింటినీ విడుదల చేస్తానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+