టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగా నిలిస్తే అరెస్టులా.?శ్రామిక చట్టాలకు వైసిపి తూట్లు పొడుస్తుందన్న జనసేన.!
అమరావతి/హైదరాబాద్:ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ బాగా ఆక్టివేట్ ఐనట్టు తెలుస్తోంది. ఇటీవల సంభవించిన వరదల్లో బాదితులకు అలుపెరగని సాయం అందించింది జనసేన. తర్వాత రైతాంగానికి అండగా నిలబడింది. అంతకు ముందు దెబ్బతిన్న రహదారులను శ్రదానంతో పునరుద్దరించారు జనసైనికులు. ఈ కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తోంది జనసేన.
ఇందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధీనంలో పని చేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల, కార్మికుల విధులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పోరాడుతుంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదు సరికదా కార్మికుల దీక్షలను భగ్నం చేసేలా పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అర్థరాత్రి నుంచి కార్మికులను, మహిళలను అరెస్టులు చేస్తున్నారని వైసిపీ ప్రభుత్వంపై ఘాటుగా స్పందిస్తోంది జనసేప.

వేల మంది కార్మికుల పోరాటానికి అండగా నిలిచిన జనసేన నాయకులను సైతం కట్టడి చేసేందుకు అదుపులోకి తీసుకొంటున్నారని, ఈ చర్యలు అప్రజాస్వామికమని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. తమ డిమాండ్లను, బాధలను తెలియచేస్తూ ఆందోళనలు చేపట్టడం ప్రజాస్వామ్యంలో భాగమని, ఇందుకు భిన్నంగా వ్యవహరించడాన్ని ఖండిస్తున్నామన్నారు జనసేన నేతలు.

టీటీడీ కార్మికులకు అండగా నిలిచిన జనసేన చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, ప్రోగ్రామ్స్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి పగడాల మురళీ, పార్టీ నాయకులు మధుబాబు, రాజారెడ్డి, మనోహర్ దేవర తదితరులను అరెస్టు చేశారని అన్నారు. కార్మికులు గత 14 రోజుల నుంచి పోరాటం చేస్తుంటే జనసేన నాయకులు, జన సైనికులు అండగా నిలిచారని, సొసైటీలుగా ఏర్పడి కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు విధులు నిర్వర్తిస్తుంటే ఇప్పుడు వారిని రోడ్డు మీదకు తెచ్చారని, శ్రామిక చట్టాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న టీటీడీ తక్షణమే తన నిర్ణయాలను పునరాలోచించుకొని కార్మికులకు, ఉద్యోగులకు న్యాయం చేయాలని జనసేన డిమాండ్ చేస్తోంది.












Click it and Unblock the Notifications