"నా మౌనం బలహీనత కాదు..!" - జాబ్స్ స్కాంపై నోరువిప్పిన జనసేన నేత కోట రుక్మిణి..!

ఏపీలో జనసేన కార్యాలయం పేరుతో ఉద్యోగాలిప్పిస్తానంటూ ఏడు కోట్ల రూపాయలు మోసానికి పాల్పడిన వ్యవహారం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ స్కాంతో జనసేన పార్టీ నేత కోట రుక్మిణి (Rukmini Kota)కి సంబంధం ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై ఇవాళ ఆమె స్పందించారు. తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టి, తనను టార్గెట్ చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఓ లేఖ విడుదల చేశారు.

Cyclone Akvan: ఏపీకి భారీ ఊరట- తుఫాన్ యూటర్న్- అంతకంతకూ..!
Cyclone Akvan: ఏపీకి భారీ ఊరట- తుఫాన్ యూటర్న్- అంతకంతకూ..!

నా మౌనం నా సంయమనం. నా సహనం నా బలం. న్యాయం కోసం నా పోరాటం చట్టబద్ధమైన మార్గంలోనే సాగుతుందంటూ కోట రుక్మిణి లేఖ ప్రారంభించారు. చాలా సంవత్సరాలుగా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి, కల్పిత కథనాలను ప్రచారం చేయడానికి, వృత్తిపరమైన ప్రతిష్ఠను దిగజార్చడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తాను విశ్వసించే విలువలను, పనిచేస్తున్న పదవికి సంబంధించిన వృత్తిపరమైన నియమ నిబంధనలను గౌరవిస్తూ ఇన్నాళ్లూ మౌనంగా ఉండాలనుకున్నట్లు తెలిపారు. అయితే, తన వ్యక్తిత్వాన్ని కించపరచడం, కుటుంబాన్ని వివాదాల్లోకి లాగడం, నిరాధార ఆరోపణలు చేయడం వంటి ప్రయత్నాలు పదేపదే జరుగుతుండటంతో హద్దులు దాటిపోయాయన్నారు.

Janasena s Rukmini Kota Defends Herself Over Job Recruitment Fraud Says Employee Was Terminated

ఇటీవల తన సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన పేరును, కంపెనీ గుర్తింపును, అధికారిక పత్రాలను దుర్వినియోగం చేస్తూ ఆర్థిక ప్రయోజనాల కోసం తీవ్రమైన ఉద్యోగ నియామక మోసానికి పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ కార్యకలాపాలన్నీ అధికారిక పని వేళలకు వెలుపల, తన ప్రమేయం, అనుమతి లేదా సమ్మతి లేకుండానే జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ విషయం తెలియగానే వెంటనే షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ కోరానన్నారు. అంతర్గత విచారణ అనంతరం ఆ ఉద్యోగి సేవలను రద్దు చేశానన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తగిన చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించానన్నారు. అయితే, అసలు నేరానికి పాల్పడిన వారిని ప్రశ్నించాల్సింది పోయి, కొంతమంది రాజకీయ నాయకులు, మీడియా వేదికలు ఈ మోసానికి సంబంధించి ఫిర్యాదు చేసిన తననే నిందితురాలిగా చిత్రీకరిస్తున్నాయన్నారు. వాస్తవాలను వక్రీకరించి, తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జరుగుతున్న ఈ ఉద్దేశపూర్వక ప్రయత్నం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోందన్నారు.

Ys Jagan: జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం- చాలా కాలం తర్వాత ఈడీ కీలక అడుగు..!
Ys Jagan: జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం- చాలా కాలం తర్వాత ఈడీ కీలక అడుగు..!

కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికల ద్వారా తనపై జరుగుతున్న పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు రుక్మిణి తెలిపారు. ఒక మహిళ గౌరవం అనేది ఆమె ఒక్కరే కాపాడుకోవాల్సిన విషయం కాదని, సమాజం కూడా దానిని గౌరవించాలన్నారు. కల్పిత కథనాలు, నిరాధార ఆరోపణలు ఒక మహిళలోని ధైర్యాన్ని, నిజాయితీని, సమగ్రతను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేవన్నారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి స్ఫూర్తి, జనసేన పార్టీకి చెందిన ఝాన్సీ వీర మహిళల అచంచలమైన ధైర్యం, న్యాయం కోసం నిలబడే వారి పోరాట స్ఫూర్తి నాకు బలాన్నిస్తాయన్నారు. ప్రతీకారం కంటే సంయమనాన్ని, భయం కంటే ధైర్యాన్ని, కక్ష సాధింపు కంటే న్యాయాన్ని ఎంచుకుంటానన్నారు. తన మౌనాన్ని బలహీనతగా భావించకూడదన్నారు. తన సహనాన్ని లొంగుబాటుగా అర్థం చేసుకోకూడదన్నారు. పవన్ కల్యాణ్ పేరును ఈ ఆరోపణలతో ముడిపెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆమె తీవ్రంగా ఖండించారు. తప్పుదారి పట్టించే కథనాల ద్వారా ఆయన పేరును వివాదాల్లోకి లాగడం సరికాదన్నారు. 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి, 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రారంభమైన తన ప్రయాణం నేటి వరకు కొనసాగుతోందన్నారు. పవన్ కల్యాణ్ నాయకత్వం, ఆశయాల పట్ల అచంచలమైన నిబద్ధతతో ప్రయాణం సాగుతోందని, ఆ నిబద్ధత ఎప్పటికీ మారదన్నారు.

ఆ రెండు తుఫాన్లను మించిన ముప్పు-అక్వాన్ పై తేల్చేసిన పవన్..! రేపటి నుంచి..!
ఆ రెండు తుఫాన్లను మించిన ముప్పు-అక్వాన్ పై తేల్చేసిన పవన్..! రేపటి నుంచి..!

ఒక మహిళగా, నిబద్ధత కలిగిన జనసైనికురాలిగా, ఝాన్సీ వీర మహిళకు ఉండే ధైర్యం, విశ్వాసం, పోరాట పటిమను తాను కలిగి ఉన్నానని, వ్యక్తిత్వ హననం ద్వారా తనను భయపెట్టలేరన్నారు. దుష్ప్రచారం ద్వారా తన గొంతును నొక్కలేరన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, దాచుకోవాల్సింది కూడా ఏమీ లేదన్నారు. తన వ్యక్తిత్వాన్ని కళంకితం చేయడానికి, తను సమగ్రతను దెబ్బతీయడానికి, కుటుంబాన్ని అసత్య ప్రచారంలోకి లాగడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. తన గౌరవాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. అవసరమైన ప్రతి చట్టపరమైన మార్గాన్ని అనుసరిస్తానని, తన మౌనాన్ని నిస్సహాయతగా భావించకూడదని తెలిపారు. తన సహనాన్ని భయంగా భావించకూడదన్నారు. బాధ్యులైన వారిని చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా బాధ్యులుగా నిలబెడతానని హెచ్చరించారు. పవన్ గారి నుంచి ఒక విషయం నేర్చుకున్నానని, ధర్మ మార్గంలో సవాళ్లు, ఆటంకాలు, ఇబ్బందులు సహజమని, పట్టుదల, స్థైర్యం, సహనం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా దృఢంగా నిలబడటం తనకు నేర్పించారన్నారు. తాను నిబద్ధత కలిగిన జనసైనికురాలినని, ఎప్పటికీ అలాగే కొనసాగుతానని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+