జియో, ఎయిర్ టెల్ అదిరిపోయే ఆఫర్లు
రిలయన్స్ జియో(Jio), ఎయిర్‌టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు ఏడాది కాలానికి ప్రీపెయిడ్ ప్లాన్స్ అందుబాటులో ఉంచాయి. వీటిద్వారా మనం 365 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. అలాగే అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఉచితంగా డిస్నీ+హాట్ స్టార్ చూడొచ్చు.
ఎయిర్‌టెల్ మూడు ప్లాన్స్ ఇస్తోంది. 3359 ప్లాన్ లో రోజుకు 2.5 జీబీ డేటా వస్తుంది. ఏడాది పాటు హాట్‌స్టార్ డిస్నీ పొందొచ్చు. 2999 ప్లాన్ కూడా ఉంది. దీంట్లో 2 జీబీ డేటా వస్తుంది. ఈ రెండు ప్లాన్స్‌లో అన్ లిమిటెడ్ 5జీ డేటా పొందొచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, అన్ లిమిటెడ్ కాల్స్ సదుపాయం ఉంది. 1799 ప్లాన్ లో 24 జీబీ డేటా, 3600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

వొడాఫోన్ ఐడియా ప్లాన్ ధర రూ. 3099. రోజుకు 2 జీబీ డేటా, బింగ్ ఆల్ నైట్, వీఐ హీరో, వీఐ మూవీస్, డేటా డిలైట్స్ వంటి బెనిఫిట్స్ పొందొచ్చు. డిస్నీ హాట్‌స్టార్ సంవత్సరం కాలానికి బ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు. 2899 ప్లాన్ లో రోజుకు 1.5 జీబీ డేటా, బింగ్ ఆల్ నైట్, వీఐ హీరో, వీఐ మూవీస్ వంటి బెనిఫిట్స్ ఉంటాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యం ఉంది.
రిలయన్స్ జియో 365 రోజుల వాలిడిటీలో కొత్త రీచార్జ్ ప్లాన్ తెచ్చింది. ధర రూ. 2,999. రోజుకు 2.5 జీబీ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలు లభిస్తాయి. ఆఫర్ కింద 23 రోజుల అదనపు వాలిడిటీ లభిస్తుంది. 75 జీబీ అదనపు డేటా వస్తుంది. ప్రతి నెలా రీఛార్జ్ ఎందుకులే అనుకుంటే ఈ వార్షిక ప్లాన్స్‌ను ఎంచుకోవచ్చు. ఎంచుకునే ప్లాన్ ఆధారంగా లభించే బెనిఫిట్స్ మారుతుంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.












Click it and Unblock the Notifications